English | Telugu

'అల్లు' పేరు మాత్రమే కాదు ఇట్స్ ఏ బ్రాండ్!


ఆలీతో సరదాగా షోలో కామెడీతో పాటు కాంట్రావర్సీ కూడా ఉంటుంది. ఇక ఈ వారం ఈ షోకి అల్లు అరవింద్ వచ్చారు. ఈ షోలో ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అల్లు అనే ఇంటి పేరుని సార్ధకం చేసాడు అల్లు అర్జున్. ఇక ఆలీ అల్లు అరవింద్ ని ఒక ప్రశ్న అడిగారు.

“సపోజ్ మీ నాన్నగారు అల్లు రామలింగయ్య గారు సడన్ గా కనిపిస్తే మీరేం చెపుదామనుకుంటున్నారు” అని అడిగేసరికి “ఆయనకి అల్లు అంటే చాలా ఇష్టం. నేను ప్రయత్నించి చాలా దూరం తీసుకెళ్ళాను. ఇప్పుడు నీ మనవళ్లకిచ్చాను. వాళ్ళు ఇంకా ఎత్తుకి తీసుకెళ్తున్నారు" అని చెప్తా అంటూ నవ్వేశారు. ఆ ఆన్సర్ కి ఆలీ "వాహ్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. నిర్మాతగా అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పెట్టి దాని ద్వారా అల్లు అనే బ్రాండ్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లారని విషయం అందరికీ తెలుసు.

హీరో, విజేత, పసివాడి ప్రాణం, మాస్టర్, గంగోత్రి, జల్సా, మగధీర, ధృవ, గీతా గోవిందం వంటి ఎన్నో హిట్ మూవీస్ నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇక ఆయన పిల్లలైన అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇంటి పేరుని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఈ ఆలీతో సరదాగా షో ప్రోమో 2 సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.