English | Telugu
బిగ్ బాస్ లో సింగర్ రేవంత్ రెమ్యూనరేషన్ ఎంత ?
Updated : Oct 12, 2022
ప్రస్తుతం బిగ్ బాస్ లో సింగర్ రేవంత్ చాలా స్ట్రాంగ్ కంటెండర్ గా రాణిస్తోన్నాడు. ఇతని పూర్తి పేరు లొల్లవెంకట రేవంత్ కుమార శర్మ . ఇతను 1990 ఫిబ్రవరి 10 న శ్రీకాకుళంలో జన్మించాడు. తన చదువు మొత్తం విశాఖపట్నంలో చదివాడు. రేవంత్ కి చిన్నప్పటినుండి సింగర్ కావాలని ఉండేదట. అందుకే డిగ్రీ చివరి సంవత్సరంలోనే హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ఎదురుచూసాడట. ఆడిషన్స్ కి వెళ్ళాలంటే కూడా తన దగ్గర డబ్బులు ఉండేవి కావట,దాంతో కేటరింగ్ కి వెళ్లి వచ్చిన డబ్బులు దాచుకొని, ఆడిషన్స్ కి వెళ్ళేవాడట. రేవంత్ సింగర్ కావడానికి చాలా కష్టపడ్డాడట. బుల్లితెరలో 2010 లో వచ్చిన సూపర్ సింగర్ -5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఈటీవీలో వచ్చిన సప్తస్వరాలు ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. సూపర్ సింగర్-7 మరియు సూపర్ సింగర్-8 లో మెంటర్ గా ఉన్నాడు. అప్పటికే చిన్న సినిమాలలో అవకాశం వచ్చింది. కాగా 2017 లో తను పాడిన పాటలకు గాను 'Indian idol' విజేతగా నిలిచాడు. దానితో సింగర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. తరువాత పలు సింగింగ్ కాంపిటిషన్స్ కి మెంటర్ గా వ్యవహరించాడు. ఇప్పటివరకు తన కెరియర్ లో చాలా గౌరవ అవార్డులు అందుకున్నాడు. ఇప్పటివరకు రేవంత్ దాదాపు వందకు పైగా పాటలు పాడాడు. రేవంత్ చిన్నప్పటి నుండి తన జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదురుకున్నాడాట, కానీ తను అనుకున్నట్టుగానే సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరిని ఎంటర్టైన్ చేస్తొన్నాడు.
బిగ్ బాస్ హౌస్ లో కి చివరి కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. రేవంత్ మొదటి వారం నుండి హౌస్ లో చురుకుగా ఉంటూ, అందరితో సన్నిహితంగా ఉంటున్నాడు. హౌస్ లో కొందరితో గొడవలు లేకపోలేదు. హౌస్ లో రేవంత్ ఎప్పుడు నామినేషన్ లో ఉన్నా కూడా ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంటున్నాడు. షో చూసే ప్రేక్షకులను తన ఆట తీరుతో ఆకర్షిస్తోన్నాడు. ఎప్పటికి అప్పుడు తన ఆట తీరులో మార్పులు చేసుకుంటు హౌస్ లో అన్నింటిలో పాల్గొంటున్నాడు. అయితే హౌస్ లో మాత్రం తనకి చాలా కోపం అనే వాళ్ళు లేకపోలేదు. దీంతో నాగార్జున గత రెండు వారాలు గట్టిగానే కౌంటర్ వేసాడు. కోపం తగ్గించుకుంటేనే హౌస్ లో ముందుకెళతావ్ అంటు నాగార్జున చెప్పాడు. కోపం తగ్గించుకొని, ఆ తర్వాత కెప్టెన్ అయ్యి తనధైనా స్టైల్ లో కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తోన్నాడు.
ఈ సీజన్ లో చివర వరకు ఉండేవాళ్ళలో రేవంత్ టాప్ -5 లో ఉంటాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కాగా తను అటలో ఇంకా ఏమైనా మార్పులు చేసి, సరికొత్త గేమ్ ప్లాన్ తో ఆడతాడో చూడాలి. అయితే రేవంత్ రెమ్యూనరేషన్ రోజుకి అరవై వేల నుండి డెభ్బై వేల వరకు తీసుకొంటున్నాడని బయట తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరిలో కంటే రేవంత్ కే ఎక్కువ రెమ్యూనరేషన్ అని బయట వినిపిస్తోంది.