English | Telugu

ఆ కామెడీ షోకి పోటీగా ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’

ఈటీవీ జబర్దస్త్ కి పోటీగా ఆహా ఓటీటీ వేదికగా ఒక కామెడీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తర్వాత మళ్ళీ అలాంటి కామెడీ షోస్ అనేవి బుల్లితెర మీద లేవనే చెప్పాలి. ఐతే జబర్దస్త్ పై వస్తున్న రూమర్స్ , ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్న వైనం చూస్తుంటే మరో కొత్త కామెడీ షో వస్తే బాగుంటుంది అని తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారు. మరి అలాంటి ఒక షో ఇప్పుడు రెడీ అవుతోందని చెప్పొచ్చు. ఇక ఇది "కామెడీ స్టాక్ ఎక్సేంజ్" అని టైటిల్ తో సుడిగాలి సుధీర్ ని ముందు పెట్టి ఈ షోని నిర్వహించేందుకు ఆహా టీం రెడీ అయ్యింది.

ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ప్రోమో చూస్తే ఫేమస్ కమెడియన్స్ అందరూ ఉన్నారు. ముక్కు అవినాష్, యాదమ్మ రాజు, సద్దాం, హరి, ఇంకా పలువురు జబర్దస్త్, పటాస్ కమెడియన్ ఈ కార్యక్రమంలో కనిపించబోతున్నారు. ఇక జడ్జిగా నాగబాబు వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సుడిగాలి సుధీర్ ఫాన్స్ ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డాన్స్ ఐకాన్ కార్యక్రమం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ ప్రోగ్రాం పూర్తయ్యే లోపు కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఆహా కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ ఓటిటితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. డాన్స్ ఐకాన్ తో పాటు బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా స్టార్ట్ అవబోతోంది. నెమ్మదిగా ఆహా కామెడీ జానర్ వైపు దృష్టి సారిస్తోందని దీన్ని బట్టి అర్ధమవుతోంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.