English | Telugu

ముగ్గురు భార్య‌ల మ‌ధ్య ఇరుక్కుపోయిన అవినాష్!

బిగ్‌బాస్ సీజ‌న్ 4తో ముక్కు అవినాష్ ద‌శ తిరిగిపోయింది. అంత‌కు ముందు జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ అత‌న్ని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట‌రైతే షో నుంచి వెలివేస్తామ‌ని బెదిరించ‌డంతో అవినాష్ చాలా సందర్భాల్లో క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అత‌ని ప‌రిస్థితిని గ‌మ‌నించిన స్టార్ మా ఏడాది పాటు త‌మ ఛాన‌ల్‌లో కామెడీ షో చేయాల్సిందిగా అత‌నికి ఆఫ‌ర్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంది.

ఆ అగ్రిమెంట్ ప్ర‌కారమే 'కామెడీ స్టార్స్‌' షోని ఓంకార్ చేత స్టార్ట్ చేయించింది. ఈ షోలో ముక్కు అవినాష్ టీమ్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌తో పాటు మ‌రో టీమ్ కూడా పాల్గొంటూ హాస్యాన్ని పండిస్తోంది. ఇదిలా వుంటే ఈ షోలో భాగంగా గ‌త వారం ముక్కు అవినాష్ భార్య‌గా, గ‌య్యాళి వ‌దిన‌గా అరియానా గ్లోరీ క‌లిసి ర‌చ్చ చేసింది. వ‌చ్చే ఆదివారం అవినాష్ ముగ్గురు ముద్ద గుమ్మ‌లు అషురెడ్డి, జోర్దార్‌ సుజాత‌, సిరి హ‌న్మంత్‌ల‌తో క‌లిసి ర‌చ్చ చేయ‌బోతున్నాడు.

ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఈ షోలో అవినాష్ ముగ్గురు పెళ్లాల‌తో తిప్ప‌లు అనే స్కిట్‌ని చేశాడు. ఇందులో అవినాష్ ముగ్గురు భార్య‌లుగా అషురెడ్డి, జోర్దార్ సుజాత‌, సిరి హ‌న్మంత్ లు న‌టిస్తున్నారు.

మొద‌ట విడివిడిగా ఒక్కొక్క‌రితో ఆడుతూ పాడుతూ హాయిగా క‌నిపించిన అవినాష్‌, ఆ త‌ర్వాత ఒక పెళ్లికి ఒక భార్య‌తో క‌లిసి వెళ్తే, అక్క‌డ మిగ‌తా ఇద్ద‌రు భార్య‌లూ రావ‌డంతో ఎలా బిక్క‌చ‌చ్చిపోయాడు, వారి నుంచి త‌ప్పించుకోడానికి ఎలాంటి వేషాలు వేశాడ‌నేది చూచాయ‌గా చూపించిన‌ ప్రోమో ప్ర‌స్తుతం న‌వ్వులు పూయిస్తోంది. ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే.. ఇంకెన్ని న‌వ్వులు పండుతాయో!

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.