English | Telugu

పాట‌ల‌క్క కోసం ద‌ర్శ‌కేంద్రుడి కొత్త స్కీమ్‌!

స్టార్ మాలో 'కార్తీక దీపం' సీరియ‌ల్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్‌కి మ‌హిళా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇందులో వంటల‌క్క‌గా దీప పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సీరియ‌ల్ కార‌ణంగా ఈమె స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది.

ఈ సీరి‌య‌ల్ థీమ్‌ని వాడుకుంటూ వంట‌ల‌క్క త‌ర‌హాలో పాట‌ల‌క్క పాత్ర‌ని డిజైన్ చేశారు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. ఆయ‌న నిర్మిస్తున్న తాజా సీరియ‌ల్ 'కృష్ణ తుల‌సి'. జీటీవీలో ఈ సీరి‌య‌ల్ ఈ నెల 22 నుంచి ప్ర‌సారం కాబోతోంది. ఈ సీరియ‌ల్ ప‌బ్లిసిటీ కోసం పాపుల‌ర్ టీవీ న‌టీమ‌ణుల్ని రంగంలోకి దింపిన రాఘ‌వేంద్రరావు కొత్త స్కీమ్‌ని ఈ సీరియ‌ల్ కోసం మొద‌లుపెట్టారు.

కృష్ణ తుల‌సి మొక్క‌ల పంప‌ణీ ప్రారంభించిన రాఘ‌వేంద్రుడు కొత్త‌గా బొట్టుబిళ్ల‌ల‌ స్కీమ్‌ని ప్రారంభించారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బొట్టుబిళ్ల‌ల్ని ఈ సీరియ‌ల్ ప్ర‌మోష‌న్ కోసం పంపిణీ చేస్తున్నారు. మ‌రి రాఘ‌వేంద్రుడి బొట్టుబిళ్ల‌ల‌ స్కీమ్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. 22న మొద‌ల‌య్యే ఈ ధారావాహిక సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు సాయంత్రం 6:30 గంట‌ల‌కు జీ తెలుగులో ప్ర‌సారం కాబోతోంది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.