English | Telugu
'జబర్దస్త్'ను బీట్ చేసిన 'కామెడీ స్టార్స్'!
Updated : Feb 13, 2021
ఈటీవీ ఛానల్‌లో మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రారంభమైన 'జబర్దస్త్' కామెడీ షోని ఏ కార్యక్రమం బీట్ చేయలేకపోయింది. జనాల్లో కామెడీ షో అంటే 'జబర్దస్త్' అనేంతగా పాపులారిటీని ఈ షో దక్కించుకుంది. దీంతో నిర్వాహకులతో పాటు వీక్షకులూ ఈ షోని కొట్టేది మరోటి లేదని, రాదని ఫిక్సయిపోయారు.
ఈ షోని బీట్ చేయాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఫ్లాపయ్యారు. కానీ తాజాగా ఈ షోని స్టార్ మాలో కొత్తగా ప్రారంభమైన 'కామెడీ స్టార్స్' షో బీట్ చేసి దిమ్మదిరిగే షాకిచ్చింది. వర్షిణి సౌందరరాజన్ వ్యాఖ్యాతగా శేఖర్ మాస్టర్, శ్రీదేవి న్యాయనిర్ణేతలుగా ప్రారంభమైన ఈ షో హాస్య ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ముక్కు అవినాష్, అరియానా, చమ్మక్ చంద్ర అండ్ టీమ్ పాల్గొంటున్న ఈ షో గత వారం 9 రేటింగ్ పాయింట్లని సాధించి ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలో జబర్దస్త్‌కు కేవలం 7 శాతం మాత్రమే రేటింగ్ రావడం గమనార్హం. 'కామెడీ స్టార్స్' షో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1:30కు స్టార్ మాలో ప్రసారం అవుతోంది.