English | Telugu
అరియానా గయ్యాళి వదిన అయిన వేళ..!
Updated : Feb 13, 2021
బిగ్‌బాస్ సీజన్ 4లో ముక్కు అవినాష్, అరియానా జోడీకి మంచి మార్కులు పడిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కామెడీ స్టార్స్' షోలో ప్రత్యక్షమయ్యారు. వర్షిణి సౌందరరాజన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు శేఖర్ మాస్టర్, శ్రీదేవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం అవుతున్న ఈ షోలో లో గయ్యాళి వదినగా అరియానా ఓ రేంజ్‌లో రచ్చ చేసింది.
ఇందుకు సంబంధించిన ప్రోమో సందడి చేస్తోంది. అవినాష్ ఈ షోలో ఓ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తుంటే, చమ్మక్ చంద్ర మరో టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో కోసం ముక్కు అవినాష్, అరియానా కలిసి స్కిట్ చేశారు. ఇందులో ముక్కు అవినాష్ భర్తగా, అరియానా భార్యగా నటించారు. భర్త హోదాలో కాఫీ అడిగితే అరియానా ఏకంగా ముఖంపైనే కొట్టేసింది.
ఇక ముక్కు అవినాష్ తమ్ముడిపై వీర లెవెల్లో వీరంగం ఆడింది. అవినాష్ తమ్ముడు అమ్మా అని పిలవడంతో వీరంగం వేసిన అరియానా అతన్ని ఓ ఆట ఆడేసుకుంది. జుట్టుపట్టుకుని రచ్చ చేసింది. తినే తింగడి అవినాష్ ముక్కుకే పోతోందా అని చిందులేసింది.. అంతటితో ఆగక అవినాష్ తమ్ముడి జుట్టుపట్టుకుని తిండి మొత్తం దీనికే పోతోందారా అంటూ చిందులు తొక్కింది. గయ్యాళి వదినగా అరియానా వీరంగం వేసిన 'కామెడీ స్టార్స్' ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం కాబోతోంది.