English | Telugu

జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి తప్పు చేశాను!

ధనాధన్ ధన్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు ధన్ రాజ్. జబర్దస్త్ కి రాక ముందే ఎన్నో మూవీస్ లో కూడా నటించాడు. ఇప్పుడు కూడా మూవీస్ లో నటిస్తున్నాడు కానీ మల్లెమాల టీమ్ నుంచి ఆయన ఎప్పుడో ఆగిపోయాడు. దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

"జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి తప్పు చేసాను. ఈ విషయంలో నేను వేణును చాలాసార్లు తిట్టాను కూడా. అప్పట్లో మా టీవీలో 'ఆలీ టాకీస్' అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఆ షోకి ఆలీ గారు అనుకోని కారణాల వలన దూరమయ్యేసరికి ఆ షో పేరుని'మా టాకీస్'గా మార్చారని వేణు చెప్పాడు. ఇక అందులో నేను, నువ్వు యాంకర్స్ అని చెప్పి ఒప్పించాడు వేణు. 'మనం యాంకరింగ్ చేయగలమా?' అని కూడా అడిగాను.. చేయగలం అని చెప్పాడు. అప్పటికి జబర్దస్త్ లో ఉన్నాం. 'మా టాకీస్' యాంకరింగ్ ఆఫర్ గురించి జబర్దస్త్ దీప్తి గారితో చెప్పాను. అది యాంకరింగ్, ఇది కామెడీ.. రెండూ చేస్తే బాగోదు. ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతారు. 'మా టాకీస్' షో కాంట్రాక్టు అయిపోయిన తర్వాత జబర్దస్త్ కు రావాలని దీప్తి గారు చెప్పారు. నాకు ఆ విషయం ఎంతో నచ్చింది."అని చెప్పుకొచ్చాడు ధ‌న్‌రాజ్.

"మా టాకీస్ ఐపోయాక జబర్దస్త్ కి వెళదాం అని అనుకున్నా కానీ అప్పటికే నేను, వేణు లేని లోటును గెటప్ శీను, సుడిగాలి సుదీర్ భర్తీ చేశారు. నేను, వేణు మళ్ళీ జబర్దస్త్ కి వెళ్తే అప్పటివరకు టీమ్ లీడర్లుగా చేస్తున్న వాళ్లు మళ్లీ కంటెస్టెంట్లుగా చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. మేమెందుకు వెళ్లి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అనుకుని వెళ్ళలేదు." అంటూ ధన్ రాజ్ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.