English | Telugu

తల్లి కాబోతున్నాన‌ని చెప్పిన‌ 'దేవత' ఫేమ్‌ వైష్ణవి!

స్టార్ మాలో దేవత సీరియల్‌ను ఫాలో అయ్యే వీక్ష‌కులు చాలామందే. ఆ సీరియల్ లో హీరోయిన్‌ సుహాసిని చెల్లిగా చేసిన వైష్ణవి అందరికీ తెలుసు. ఆమె ఎమోషనల్ నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. ఐతే ఆ మ‌ధ్య ఈ సీరియల్ నుంచి ఆమె పక్కకు తప్పుకుంది. ఆమె ఎందుకు సీరియల్ నుంచి వెళ్లిపోయిందో ఎవరికీ తెలీదు. ఆమె ప్లేస్ లో మరో నటి వచ్చింది.

సీరియల్‌ నుంచి బయటికి వచ్చేశాక "వాహ్‌ వైష్ణవి" అనే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి ఫాన్స్ తో టచ్ లో ఉంది. ఈ ఛానల్ ద్వారా ప్రతీ విషయం తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటోంది. వైష్ణవి కరీంనగర్ కు చెందిన సీరియల్ డైరెక్టర్ సురేష్ కుమార్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. దానికి సంబంధించిన‌ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. కానీ తర్వాత చాలా రోజుల పాటు యూట్యూబ్ లో ఆమె ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వ లేదు. ఇప్పుడు ఒక కొత్త వీడియోతో ఫ్యాన్స్ ముందుకొచ్చింది వైష్ణవి.

ఆమె త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. వారి కుటుంబంలోకి కొత్త మెంబర్‌ రాబోతున్నట్లు ఈ వీడియో ద్వారా చెప్పింది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాలేదని, బాగా వాంతులు వాంతులవుతున్నాయని, కాబట్టి ఆడియన్స్ ముందుకు రాలేకపోయాయని, ఇక ఇప్పుడు కాస్త ఓపిక తెచ్చుకుని తన ఫాన్స్ తో షేర్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.