English | Telugu

Podharillu : మాధవకి నిజం చెప్పేసిన మహా.. షాక్ లో చక్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -42 లో..... మహా, చక్రి ఇద్దరు ఊళ్ళోకి ఎంట్రీ అవ్వగానే వాళ్ళకి సంబంధించిన రిసెప్షన్ ఫ్లెక్సీ చూస్తారు. అక్కడ ఫ్లెక్సీ చూసి మహా, చక్రి షాక్ అవుతారు. ఏంటి మీ వాళ్లు నన్ను మీకు పర్మినెంట్ వైఫ్ గా చేద్దామని ఫిక్స్ అయినట్లు ఉన్నారని మహా కోప్పడుతుంది. ఇంటికి రాగానే చక్రి కోపంగా.. ఏంటి అన్నయ్య ఇది అని అడుగుతాడు. ఒరేయ్ వాళ్లకేం చెప్పలేదా అని మాధవ అనగానే కన్నా సర్ ప్రైజ్ అన్నాడు అందుకే ఏం చెప్పలేదని కేశవ అంటాడు.

చక్రి, మహా ఇద్దరు లోపలికి వెళ్తారు. మహా గదిలోకి వెళ్తుంది. నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా.. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు.. ఇప్పుడు ఇలా ఇదంతా చేస్తే ఎలా ఉంటుందని చక్రి అంటాడు. నువ్వు మాకు చెప్పే పెళ్లి చేసుకున్నావా ఏంటని కేశవ అంటాడు. చక్రి, కేశవ మధ్య గొడవ జరుగుతుంది. ఒకరి చొక్కా ఒకరు పట్టుకొని గొడవపడుతుంటే మహా వస్తుంది. తనని చూసి ఇద్దరు ఆగిపోతారు. కన్నా బయటకు వచ్చి ఏడుస్తుంటే కేశవ వస్తాడు. వదిన మనల్ని చూసి ఏమనుకుంటుంది. ఎందుకు అలా గొడవపడుతున్నారని కన్నా అనగానే అన్నయ్యతో అలా మాట్లాడేసరికి కోపం వచ్చిందని కన్నాతో కేశవ అంటాడు. మరొకవైపు తాయారు వాళ్ళ అన్నయ్యని తీసుకొని రిసెప్షన్ కి రెడి అవుతుంది. మనం వెళ్ళేది రిసెప్షన్ చూడడానికి కాదు రిసెప్షన్ ఎలా ఆగుతుందో చూడడానికి అని తాయారు వాళ్ళ అన్నతో అంటుంది‌. మీరు వెళ్ళండి నేను వస్తానని గాయత్రి అనుకుంటుంది.

ఆ తర్వాత రిసెప్షన్ కి అందరు వస్తారు. అమ్మాయికి నచ్చజెప్పి తీసుకొని రమ్మని చక్రితో మహా అంటాడు. మహా దగ్గరికి చక్రి వచ్చి మాట్లాడతాడు. నా గోల్ ఇది కాదు.. ప్లీజ్ మీ వాళ్ళని భ్రమ నుండి బయటకు రమ్మని చెప్పండి అని మహా అంటుంది. తరువాయి భాగంలో మాధవకి మహా నిజం చెప్తుంది. మేం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని చెప్పగానే మాధవ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ ని తక్కువ అంచనా వేసి‌న రాజ్.. చిక్కుల్లోపడ్డ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -946 లో.....రాజ్, కావ్య మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసితో మాట్లాడుతారు. వాళ్ళ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయమని తన భర్తకి తులసి చెప్తుంది. ఒకసారి పాపని ఎత్తుకుంటానని తులసిని కావ్య అడుగుతుంది. సరే అని తులసి పాపని ఇస్తుంది. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్ళమని మినిస్టర్ అనగానే తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోపల దాక్కున్న రుద్రాణి బయటకు వస్తుంది.

Karthika Deepam2 : జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు.. దీప, కార్తీక్ ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -584 లో... దీప, కార్తీక్ డాక్టర్ గదిలో నుండి బయటకు వస్తారు. అప్పుడే జ్యోత్స్నని తీసుకొని దశరథ్, శివన్నారాయణ వస్తు వాళ్ళకి ఎదురుపడతారు. మీరేంటి ఇక్కడ అని శివన్నారాయణ అడుగగా.. దీపకి టెస్ట్ ల కోసమని వచ్చామని కార్తీక్ చెప్తాడు. మరి దీప కోసం అయితే గైనకాలజీస్ట్ ని కలవాలి గానీ డాక్టర్ హారిక గారి గదిలో నుండి వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. అంటే సుమిత్ర అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందామని వచ్చామని దీప అంటుంది.