English | Telugu
Jayam serial : అందరి ముందు మాటిచ్చిన శకుంతల.. గంగకి సపోర్ట్ దొరికినట్టేనా!
Updated : Feb 4, 2026
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -184 లో..... గంగ, రుద్రలకి సన్మానం చేసాక శకుంతల, పెద్దసారు మాట్లాడుతుంటారు. గంగని బాక్సింగ్ చేయాలని రుద్ర అనుకున్నాడని పెద్దసారు చెప్తాడు. రుద్ర ఆశయం నెరవేర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని శకుంతలతో పెద్దసారు చెప్పిస్తాడు. అమ్మవారు మీ చేతుల మీదుగా అగ్రిమెంట్ పేపర్ ఇచ్చి నన్ను ఆశీర్వదించమని గంగ అంటుంది. శకుంతల కోపంగా చూస్తుంటే పక్కనే ఉన్న పెద్దసారు కవర్ చేస్తాడు. దాంతో గంగ చేతిలో అగ్రిమెంట్ పేపర్ పెట్టి ఆశీర్వదిస్తుంది శకుంతల.
అందరు ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఇంటికొచ్చాక పెద్దసారు మీద శకుంతల సీరియస్ అవుతుంది. ఎందుకిలా చేశారని శకుంతల అనగానే.. మీరేం చేశారో మీకు తెలియదా అని శకుంతల అంటుంది. అక్కడిక్కడ పరిస్థితులు క్రియేట్ చేసి నా చేత అలా మాట్లాడించారని శకుంతల అనగానే.. అక్కడ అలాగే మాట్లాడాలని పెద్దసారు అంటాడు. నువ్వెప్పుడు మా గురించే ఆలోచిస్తారు కదా వదిన అని శకుంతలతో మరిది అంటాడు. ఆ తర్వాత అందరు గంగకి సపోర్ట్ గా మాట్లాడతారు. మీరందరు అనుకున్నప్పుడు నేను చెప్తే మాత్రం వద్దనుకుంటారా అని శకుంతల అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను బాక్సింగ్ ప్రాక్టిస్ కి వెళ్తానని గంగ అనగానే శకుంతల కోపంగా లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ టైమ్ కాంపిటీషన్ నుండి బయటకు రాకూడదని రుద్ర అంటాడు. అత్తయ్య ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కదా అని ఇషిక అంటుంది. మౌనం అర్థాంగీకారం అని పెద్దసారు అంటాడు.
ఇక కాసేపటికి వీరు, ఇషిక, పారు మాట్లాడుకుంటారు. నాతో రుద్ర ప్రేమలో ఉన్నప్పుడు జరిగిన గత జ్ఞాపకాలని మళ్లీ గుర్తుచేస్తా అని పారు అంటుంది. ఆ తర్వాత ఓ ప్లాన్ ని ఇద్దరికి వివరిస్తుంది. మరుసటి రోజు శకుంతల వాళ్ళ ఇంటికి పారు వస్తుంది. అందరు షాక్ అవుతారు. రుద్రతో పర్సనల్ గా మాట్లాడాలని పారు అనగానే ఎందుకని అడుగుతారు. శకుంతల పర్మిషన్ ఇవ్వడంతో ఇద్దరు గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. అక్కడ తను కూడా జిమ్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నట్టు.. హెల్ప్ చేయాలని రుద్రని పారు అడుగుతుంది. దాంతో తను ఒప్పుకుంటాడు. మరోవైపు బయట ఉన్న అందరు లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.