English | Telugu

Illu illalu pillalu : అమూల్య తాళి వేసుకోడానికి కారణం ప్రేమ.. కోపంగా ఉన్న ధీరజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -385 లో...... రామరాజుని ఆ పరిస్థితిలో చూసి ధీరజ్ తట్టుకోలేకపోతాడు. ఒరేయ్ ధీరజ్ నువ్వు ఏడిస్తే ఎలారా అని ప్రేమ అంటుంది. దాంతో ప్రేమని హగ్ చేసుకొని ధీరజ్ ఏడుస్తాడు. నా హార్ట్ బీట్ చూడమని ప్రేమ చెయ్ పట్టుకొని తన హార్ట్ పై పెడతాడు ధీరజ్. ఒరేయ్ ఇంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది ఏంట్రా అని ప్రేమ అంటుంది. నాన్నకి ఊపిరి అందడం లేదని అన్నప్పుడు.. నా ఊపిరి ఆగిపోయింది అనుకున్నానని ధీరజ్ అంటాడు.

ఆ తర్వాత అమూల్య దగ్గరికి రేవతి వచ్చి నీకు అమ్మ దూరంగా ఉంది. అమ్మ ప్రేమ కాదు.. నీకు ఏం అవసరం ఉన్నా నాతో చెప్పమని అమూల్యతో రేవతి చెప్తుంది. ఆ తర్వాత అమూల్య కిటికీ ఓపెన్ చేసి తన వాళ్ళని చూడాలని అనుకుంటుంది. అప్పుడే విశ్వ వచ్చి ఆ కిటికీ రాదు మా అత్త పాతికేళ్ళ క్రితం మేకులు కొట్టించిందని విశ్వ అంటాడు. మీరు దుర్మార్గులు అని తెలుసురా అని అమూల్య అంటుంది. తాళి కట్టపోయినా మెడలో వేసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాం అన్నావ్ కదా.. పెళ్లి చేసుకున్నప్పుడు కాపురం కూడా చెయ్యాలి కదా అని అమూల్య చెయ్ పట్టుకుంటాడు విశ్వ. దాంతో అమూల్య కత్తి పట్టుకుంటుంది. నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను చంపి నేను జైలుకి వెళ్తానని అమూల్య అనగానే నీలో ఇంత దైర్యం ఏంటే నీ వెనకాల ఎవరు ఉన్నారే అని విశ్వ అంటాడు. నా వెనకాల ఉన్నారని అమూల్య అనగానే విశ్వ భయంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అమూల్య తన మెడలో ఎలాంటి సిచువేషన్ లో తాళి వేసుకుందో గుర్తుచేసుకుంటుంది. అమూల్యని విశ్వ తీసుకొని వచ్చినప్పుడు అమూల్యని విశ్వనే తీసుకొని వెళ్లి ఉంటాడని విశ్వకి ప్రేమ ఫోన్ చేస్తుంది. అప్పుడు విశ్వ ఫోన్ గదిలో వదిలేసి వెళ్తాడు. దాంతో అమూల్య లిఫ్ట్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఇప్పుడు వీడు రాత్రంతా తనతో గడిపానని రేపు అందరి ముందు చెప్పి నాన్న పరువు తియ్యాలని అనుకుంటాన్నాడని అమూల్య చెప్పగానే నువ్వు మెడలో తాళి వేసుకో.. పెళ్లి చేసుకున్నారని అనుకుంటారు.. నీ క్యారెక్టర్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడరని ప్రేమ అనగానే అమూల్య తాళి వేసుకుంటుంది.

మరొకవైపు అమూల్య అలా వెళ్లిపోవడానికి పెళ్లి చేసుకోవడానికి ఎవరో కారణం వాళ్ళు తెలియాలని ధీరజ్ కోపంగా అంటాడు. దాంతో ప్రేమకి టెన్షన్ మొదలవుతుంది. మరొకవైపు చందు కోపంగా బయటకు వెళ్తుంటే.. తన వెనకాలే ధీరజ్, సాగర్ కూడా వెళ్తారు. ఆ తర్వాత భాగ్యం, ఆనందంరావు హోటల్ లో టిఫిన్ చేస్తుంటే.. శ్రీవల్లి వస్తుంది. కాసేపటికి శ్రీవల్లికి భాగ్యం టిఫిన్ తినిపిస్తుంది. అప్పుడే నర్మద రావడం గమనించి శ్రీవల్లి టేబుల్ కింద దాక్కుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ ని తక్కువ అంచనా వేసి‌న రాజ్.. చిక్కుల్లోపడ్డ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -946 లో.....రాజ్, కావ్య మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసితో మాట్లాడుతారు. వాళ్ళ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయమని తన భర్తకి తులసి చెప్తుంది. ఒకసారి పాపని ఎత్తుకుంటానని తులసిని కావ్య అడుగుతుంది. సరే అని తులసి పాపని ఇస్తుంది. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్ళమని మినిస్టర్ అనగానే తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోపల దాక్కున్న రుద్రాణి బయటకు వస్తుంది.

Karthika Deepam2 : జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు.. దీప, కార్తీక్ ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -584 లో... దీప, కార్తీక్ డాక్టర్ గదిలో నుండి బయటకు వస్తారు. అప్పుడే జ్యోత్స్నని తీసుకొని దశరథ్, శివన్నారాయణ వస్తు వాళ్ళకి ఎదురుపడతారు. మీరేంటి ఇక్కడ అని శివన్నారాయణ అడుగగా.. దీపకి టెస్ట్ ల కోసమని వచ్చామని కార్తీక్ చెప్తాడు. మరి దీప కోసం అయితే గైనకాలజీస్ట్ ని కలవాలి గానీ డాక్టర్ హారిక గారి గదిలో నుండి వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. అంటే సుమిత్ర అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందామని వచ్చామని దీప అంటుంది.