English | Telugu
Brahmamudi : మినిస్టర్ ని తక్కువ అంచనా వేసిన రాజ్.. చిక్కుల్లోపడ్డ ఫ్యామిలీ!
Updated : Feb 4, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -946 లో.....రాజ్, కావ్య మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసితో మాట్లాడుతారు. వాళ్ళ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయమని తన భర్తకి తులసి చెప్తుంది. ఒకసారి పాపని ఎత్తుకుంటానని తులసిని కావ్య అడుగుతుంది. సరే అని తులసి పాపని ఇస్తుంది. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్ళమని మినిస్టర్ అనగానే తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోపల దాక్కున్న రుద్రాణి బయటకు వస్తుంది.
వాడికి ఎంత దైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తాడని మినిస్టర్ అంటాడు. నాకు ఆదే అర్థం కావడం లేదని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఇంట్లో అందరు భోజనం చేస్తుంటారు అప్పుడే రాజ్, కావ్య వస్తారు. పాప బారసాల గురించి మాట్లాడుతారు. పాప ఆరోగ్యం బాలేదు కదా తనకి ఆపరేషన్ చేసాక బారసాల చేద్దాం.. ఆ లోపు అప్పు కూడా డెలివరీ అవుతుంది. ఇద్దరి పిల్లలకి ఒకేసారి బారసాల చేద్దామని రాజ్ అనగానే ఇంట్లో వాళ్ళు కూడా సరే అంటారు. మరొకవైపు రుద్రాణి, మినిస్టర్ మాట్లాడుకుంటారు. రాజ్ బలహీనత మీద దెబ్బ కొట్టాలి.. మీరేం చేస్తారో మీకు అర్థం అయింది అనుకుంటా అని రుద్రాణి అనగానే.. వాడు ఇంకొకసారి ఈ ఇంటికి రాకుండా చేస్తానని మినిస్టర్ అంటాడు. మరుసటి రోజు ఉదయం రాజ్ హాల్లో కూర్చొని టీ తాగుతుంటే మినిస్టర్ ఫోన్ చేస్తాడు. ఒరేయ్ మీ నానమ్మ తాతయ్యలని అలా వదిలేసావ్ ఏంట్రా అని పాపం అని అంటాడు. వాళ్ళకి ఏం కాకూడదు అని రాజ్ అంటాడు. వెంటనే ఇందిరాదేవి వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇందిరాదేవి వాళ్ళు మాట్లాడుతుండగా ఏదో సౌండ్ వస్తుంది. మినిస్టర్ మళ్ళీ ఫోన్ చేసి పాపం .. మీ అమ్మనాన్న అంటాడు. వెంటనే రాజ్ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మంటాడు. మళ్ళీ మినిస్టర్ ఫోన్ చేసి మీ తమ్ముడిని అలా వదిలేసావ్ ఎంట్రా అని మినిస్టర్ అంటాడు. అప్పుని తీసుకొని కళ్యాణ్ మా ఇంటికి వెళ్ళాడు. ఏం జరిగిందని కావ్య అడుగుతుంది. ఆ మినిస్టర్ ని తక్కువ అంచనా వేసామని రాజ్ టెన్షన్ పడుతాడు.
ఆ తర్వాత ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. త్రుటీలో ప్రమాదం తప్పిందని వాళ్ళు చెప్తారు. అప్పుడే అపర్ణ, సుభాష్ వచ్చి అదే చెప్తారు. మాకు అలాగే జరిగిందని కళ్యాణ్ అనగానే అప్పు నీకేం కాలేదు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా అందరికి ఒకేసారి అవ్వడం ఏంటి నాకెందుకు అనుకోకుండా జరిగింది కాదనిపిస్తుందని ధాన్యలక్ష్మి అనగానే అప్పుడే మినిస్టర్ ఎంట్రీ ఇస్తూ కరెక్ట్ చెప్పారని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.