English | Telugu
వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన సుమ!
Updated : Jul 14, 2021
యూట్యూబ్‌లో హిట్టయిన వెబ్ సిరీస్ '30 వెబ్స్ 21' చూశారా? అందులో తొలి ఎపిసోడ్‌లోనే హీరో హీరోయిన్లు చైతన్య, అనన్యకు పెళ్లైనట్టు చూపిస్తారు. ఫస్ట్ నైట్ సీన్ కూడా ఉంటుంది. కానీ, పెళ్లి సీన్ ఉండదు. హాస్పటల్‌లో అమ్మాయిని అబ్బాయి చూడటం... కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లైనట్టు చెప్పి డైరెక్టుగా ఫస్ట్ నైట్ సీన్‌లోకి వెళతారు. ఆ పెళ్లి తంతు జరిగితే ఎలా ఉంటుందో... 'స్టార్ మా' ఛానల్ షో 'స్టార్ట్ మ్యూజిక్‌లో సుమ చూపించారు.
హాస్పటల్‌లో అబ్బాయి, అమ్మాయి చూపులకు భిన్నంగా 'స్టార్ట్ మ్యూజిక్' షోలో సుమ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడమే కాదు... ఇద్దరికీ పెళ్లి చేసింది. 'మొత్తానికి మీ సిరీస్ లో జరగని పెళ్లి మా సిరీస్ లో జరిగింది' అని సుమ అంటే... 'సిరీస్ లో చాలా జరగలేదు' అని చైతన్య అన్నాడు. అందుకు అనన్య నవ్వింది. కమింగ్ సండే మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.
చైతన్య, అనన్యతో పాటు 'రామ్ లీల', 'మేడమ్ సార్ మేడమ్ అంతే' హీరో హీరోయిన్లు శ్రీహాన్, సిరి హనుమంతు... 'సూర్య' హీరో హీరోయిన్లు షణ్ముఖ్ జస్వంత్, మౌనిక ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు.