English | Telugu
హరి గుండెలపై... అమ్మ చేతిపై.. అషూ ఏది రియల్?
Updated : Jul 14, 2021
'కామెడీ స్టార్స్' షోలో కమెడియన్ హరి తన గుండెలపై అషు పేరు పచ్చబొట్టు వేయించుకున్న సంగతి తెలిసిందే. అది టెంపరరీ టాటూ కాదని, ఒరిజినల్ అని తెలియడంతో అషురెడ్డి అతడి చెంపపై చాచి ఒక్కటి ఇచ్చింది. అయితే, ఇదంతా స్కిట్ లో భాగమని... స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని కొందరి అనుమానం.
అషురెడ్డి మదర్ కూడా టాటా వేయించుకున్నారు. కుమార్తె పేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. టాటూను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అషురెడ్డి. వరల్డ్‌లో బెస్ట్ మదర్ మా అమ్మే అని చెప్పుకొచ్చింది. "నిజంగా నా పేరును టాటూగా వేయించుకున్న ఏకైక వ్యక్తి. నా నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించే ఏకైక వ్యక్తి... అమ్మ" అని అషురెడ్డి పోస్ట్ చేశారు. దాంతో హరి గుండెలపై టాటూ ఫేక్ అని అనుమానపడిన వాళ్లకు సమాధానం దొరికినట్టు అయింది.
హరి గుండెలపై... అమ్మ చేతిపై... రెండు టాటూలను పోస్ట్ చేసి 'ఏది రియల్?' అని అషురెడ్డిని ఒకరు ప్రశ్నించారు. 'రెండూ రియల్' అని ఆమె చెప్పింది. రెండూ రియల్ అయితే అమ్మ చేతిపై టాటూ పోస్ట్ చేసినప్పుడు తన పేరును టాటూ వేయించుకున్న ఏకైక వ్యక్తి అని చెప్పడం వెనుక అర్థం ఏమిటో? అషురెడ్డికి తెలియాలి. పైగా హరి తన గుండెలపై వేయించిన టాట్టూను చూపించిన తర్వాతే, అమ్మ చేతిపై తన టాట్టూను అషు షేర్ చేయడం కూడా లెక్కలోకి తీసుకోవాలి.ఇంతకీ అషు పేరును ఆమె తల్లి ఎప్పుడు పచ్చబొట్టుగా వేయించుకున్నారు?