English | Telugu

హైపర్ ఆది.. టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ.. పవన్ కోసం ఏదైనా..


జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఎంతగా నవ్విస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన కమెడియన్ ‘హైపర్ ఆది’. ఆది వేసే పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ తో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఐతే జడ్జిగా ఇంద్రజ అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆది, ఇంద్రజ ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంద్రజ గజ్జె కట్టి డాన్స్ వేస్తే ఆ సీన్ గురించి మరో ఎపిసోడ్ లో కౌంటర్ వేసేస్తాడు ఆది. ఆది, ఇంద్రజ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కామెడీ కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు. హైపర్ ఆది ఈ మధ్య సినిమాల మీద ఫోకస్ పెట్టినా బుల్లితెర మీద ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఐతే ఇప్పుడు ఆది గురించి ఇంద్రజ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. అదేంటంటే "హైపర్ ఆది ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయ్యింది. మేమిద్దరం ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం. కానీ అతను కష్టపడి చేసే పనికి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. కంగ్రాట్యులేషన్స్ ..ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తున్నా" అని చెప్తూ 2014 లో ఆది ఫోటోని ఇప్పుడు ఆది ఫోటోని కొలెజ్ చేసి పోస్ట్ చేసింది. ఇకపోతే ఆది మొదటి నుంచి చిన్న చిన్నగా అన్నిటిలోకి ఎంట్రీ ఇస్తూ ఇప్పుడు పొలిటికల్ గా కూడా కొంచెం యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఐతే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. తనను ఇంతవాడిని చేసింది ‘జబర్దస్త్’ షోనే అంటూ జనసేన సభల్లో చెప్తూ వస్తున్నాడు. ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన వైసీపీ నాయకురాలు రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. నాగబాబులానే ఆమె కూడా తనను ప్రోత్సహించారని క్లారిటీ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయనతో కలిసి నడుస్తున్నట్టు చెప్పాడు. తనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానన్నాడు. ఈసారి కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని హైపర్ ఆది వివరించాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.