English | Telugu
ఇమ్మానుయేల్ ముందే వర్షను ముద్దాడిన బుల్లెట్ భాస్కర్!
Updated : Jul 7, 2021
బుల్లితెరపై లవ్ ట్రాక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'జబర్దస్త్' షోలో లవ్ ట్రాక్ లతో సెపరేట్ షోలు కూడా చేసేస్తున్నారు. గతంలో రష్మీ-సుధీర్ లకు పెళ్లి చేసిన 'జబర్దస్త్' టీమ్ రీసెంట్ గా ఇమ్మాన్యుయేల్-వర్షలకు పెళ్లి చేసేసారు. ప్రదీప్-శ్రీముఖి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ చేద్దామని చూస్తున్నా కుదరడం లేదు. ప్రస్తుతానికైతే ఇమ్మానుయేల్-వర్ష జంటతో స్కిట్లు చేసేస్తున్నారు.
మొన్నామధ్య కెవ్వు కార్తిక్ ఈ జంటను తన స్కిట్ లో వాడేశాడు. ఇందులో కార్తీక్.. వర్షతో రొమాన్స్ చేస్తూ ఉంటే.. ఫ్రస్ట్రేటెడ్ లవర్ బాయ్ గా ఇమ్మాన్యుయేల్ కనిపించాడు. తాజాగా బుల్లెట్ భాస్కర్ కూడా ఇదే ఫార్ములా వాడేశాడు. వచ్చే వారం ప్రసారం కానున్న 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో బుల్లెట్ భాస్కర్ తన తండ్రిని కూడా తీసుకొచ్చారు.
మొదటిసారి ఇలా తన తండ్రితో కలిసి స్కిట్ వేస్తున్నాడు. అయితే ఇందులో ఇమ్మాన్యుయేల్ కు జోడీగా మరొకరిని సెట్ చేసిన భాస్కర్ తనకు జోడీగా వర్షను సెలెక్ట్ చేసుకున్నాడు. భార్యాభర్తలుగా వర్ష-బుల్లెట్ భాస్కర్ లను చూసి తట్టుకోలేకపోయాడు ఇమ్మాన్యుయేల్. అతడిని ఉడికించడానికి బుల్లెట్ భాస్కర్ ఏకంగా వర్ష చేతికి ముద్దు కూడా పెట్టాడు.
"కాఫీ తాగుతారా? టీ తాగుతారా?" అని వర్ష అడిగితే, "డార్లింగ్.. నీ చేత్తో విషమిచ్చినా కూడా స్వీట్‌గా ఉంటుంది." అంటూ ఆమె చేయి అందుకుని, చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టుకున్నాడు భాస్కర్. పక్కనే కూర్చొని ఉన్న ఇమ్ము ఉడుక్కుంటూ "భాస్కర్.. ఇందుకేనా టీమ్‌ను మార్చింది?" అంటూ కామెంట్ చేశాడు ఇమ్మాన్యుయేల్.