English | Telugu

'ఆలీతో సరదాగా' షోకి బ్రేక్!

ఈటీవీలో ప్రసారమవుతున్న "ఆలీతో సరదాగా" టాక్ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. ఐతే ఇప్పుడు ఈ షోకి బ్రేక్ పడబోతోంది అని ఆలీ తన షోలో చెప్పారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. 19 వ తేదీన ప్రసారమయ్యే ఈ షోలో ఆలీని ఇంటర్వ్యూ చేయడానికి సుమ కనకాల వచ్చింది. ఇక ఆలీకి పూల బొకే ఇచ్చి, షాల్ కప్పింది. "నేను మీకన్నా వయసులో చాలా చిన్నదాన్ని నన్ను ఆశీర్వదించండి" అని సుమ ఆలీ కాళ్ళ మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకుంది.

"ఈరోజు ఆలీ గారిని అడగాల్సివన్నీ అడిగేసి కడిగేస్తా" అని ఒక రేంజ్ లో సీరియస్ గా చెప్పేసరికి దానికి ఆలీ జోక్ గా "కడగడానికి వాటర్ తెచ్చావా అని అడిగారు. వాటర్ మాత్రమే కాదు వేరేవి కూడా తెచ్చాను ఎందుకులెండి చెప్పడం" అంది సుమ కూడా సరదాగా. ఇక ఆలీ మాట్లాడుతూ "ఈ షోని మొదట మంచు లక్ష్మితో స్టార్ట్ చేసాం..ఆమెకు మొదట థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అలా స్టార్ట్ ఐన ఈ షో 300 ప్లస్ ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఐతే ఇప్పుడు ఈ షోకి కొద్దిగా బ్రేక్ ఇస్తున్నాం. త్వరలో మరో అద్భుతమైన షోతో మీ ముందుకు వస్తాం" అని చెప్పారు ఆలీ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.