English | Telugu

శ్రీముఖి హోమ్లీ లుక్.. క్యూట్ ఫ్యామిలీ అంటున్న నెటిజన్స్!

శ్రీముఖి ఎప్పుడూ హాట్ ఫోటో షూట్స్ తో కిక్కెక్కిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం తన ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తే చాలా క్యూట్ గా చుడిదార్ లో అందంగా, సంప్రదాయంగా కనిపిస్తోంది. అది కూడా తన అమ్మ, నాన్న, తమ్ముడితో కలిసి దిగిన ఫామిలీ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఫామిలీ ఫొటోస్ చూసి ఆమె ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇక శ్రీముఖి కూడా కొత్త ఇల్లు కొనుక్కున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడే తన ఫామిలీతో కలిసి ఫొటోస్ దిగినట్లు తెలుస్తోంది శ్రీముఖి. ఇక బుల్లితెర నటి సుష్మకిరణ్ "కంగ్రాట్యులేషన్స్" అని మెసేజ్ పెట్టింది. ఇక నెటిజన్స్, రాములమ్మ ఫాన్స్ అంతా కూడా విషెస్ చెప్తున్నారు. "కొత్త ఇంట్లో పాలు పొంగించి మాకు కూడా పాయసం పంపండి..కొత్త ఇంట్లోకి వెళ్ళాక న్యూ హోమ్ టూర్ వ్లగ్ చెయ్యి అక్కా" అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శ్రీముఖి ఇప్పుడు బిజీ యాంకర్. ఇటు షోస్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో అవకాశాలు వస్తుంటే చేస్తోంది అలాగే ఫారెన్ లో జరిగే ఈవెంట్స్ లోనూ తనదైన మార్క్ చూపిస్తూ మొత్తాన్ని ఎలేస్తోంది. ఇప్పుడు బుల్లితెర మీద శ్రీముఖి హవా బాగా నడుస్తోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.