English | Telugu

గుడ్ న్యూస్.. ఒకే ఫ్రేమ్ లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో రెండో సీజన్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్లు కొద్దిరోజులు క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొనడానికి తాజాగా పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం.

ఆహాలో ప్రసారమవుతోన్న 'అన్ స్టాపబుల్' షోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వచ్చిన గెస్ట్ లతో చాలా సరదాగా మాట్లాడుతూ.. బాలయ్య తన ఎనర్జీతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. మొదటి సీజన్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ సందడి చేయగా.. రెండో సీజన్ లోనూ స్టార్స్ పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ షూట్ పూర్తయింది. ఇక ఇప్పుడు పవన్ సైతం ఈ షోలో పాల్గొనడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూట్ జరగనుందని సమాచారం.

మొదటి సీజన్ లో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ ని చివరి ఎపిసోడ్ గా ప్రసారం చేశారు. అలాగే పవన్ ఎపిసోడ్ ని కూడా రెండో సీజన్ చివరి ఎపిసోడ్ గా ప్రసారం చేసే అవకాశముందని అంటున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.