English | Telugu

అమ్మనాన్నల పెళ్ళి రోజున ఆ ఇద్దరు కూతుళ్ళు వస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -537 లో... కనకంతో మాట్లాడడానికి అపర్ణ, ఇందిరాదేవీలు వస్తారు. ఎలాగైనా కావ్య ని రాజ్ కలపాలనుకుంటారు. ఈ జన్మ లో జరిగేలా లేదు.. నేను బ్రతికి ఉండగా అవుద్దో లేదోనని కనకం అనగానే.. ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావని అపర్ణ అడుగుతుంది.‌ఎందుకు అంటే నేను ఎక్కువ రోజలు బ్రతకను.. నాకు కాన్సర్ అని కనకం అనగానే.. అపర్ణ, ఇందిరాదేవి లు షాక్ అవుతారు. ఎంత కష్టం వచ్చిందని వాళ్ళు బాధపడుతుంటే.. మీరు నిజంగానే నమ్మేసారా అంటూ కనకం నవ్వుతుంది.

ఇలా చేస్తే వాళ్ళు ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది.. రేపు మా ఇరవై అయిదో పెళ్లి రోజు అందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు వస్తారు. నాకు ఇలా అని నాటకం ఆడితే అల్లుడు గారు నమ్ముతారని కనకం అనగానే.. ఇందిరాదేవి, అపర్ణలు సరేనని అంటారు. ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి కావ్య వచ్చి.. నాన్న మీ పెళ్లి రోజు కదా రేపు సెలబ్రేట్ చేసుకుందామని కావ్య అంటుంది. ఇప్పుడు నీ సిచువేషన్ బాగోలేదు..‌ ఎందుకు వద్దని అంటాడు. స్వప్న రాదు.. అప్పు రాదని కృష్ణమూర్తి అంటాడు అప్పుడే కనకం వచ్చి స్వప్ననే ఈ పెళ్లి రోజు జరిపిస్తానని చెప్పింది అని కనకం అనగానే.. నేను చేస్తాను వాళ్ళు ఎందుకమి కావ్య అంటుంది. వాళ్లు చేస్తానంటే ఎందుకు వద్దనడమని కనకం అనగానే.. వాళ్ళు ఎవరని కావ్య అంటుంది. దాంతో కనకం టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మీ ఇష్టమంటూ కావ్య వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ ,కావ్యలని ఒక్కటిని చెయ్యడానికే ఇదంతా అని కృష్ణమూర్తితో కనకం చెప్తుంది.ఆ తర్వాత అపర్ణ, ఇందిరదేవిలు రాజ్ కి కనకం కాన్సర్ అని చెప్పాలి అనుకుంటారు కానీ వినడు. ఆ తర్వాత కనకం ఫోన్ చేసి ఇక్కడ కావ్యని ఒప్పించానని చెప్తుంది అక్కడ ఏమైందని అడుగగా.. ఇక్కడ ఫెయిల్ అని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ప్రకాష్ ని అడ్డు పెట్టుకొని రాజ్ కి చెప్పాలి అనుకుంటారు. నువ్వు రాజ్ దగ్గరికి వెళ్లి.. ఇలా పాపం కావ్య అను అంతే అని ప్రకాష్ కి అపర్ణ చెప్పి పంపిస్తుంది. ప్రకాష్ వెళ్లి అలాగే అంటాడు. అంటే కావ్యకి ఏమైంది అని లోపలికి అడగడానికి వస్తాడు అడగలేకపోతాడు. మళ్ళీ సుభాష్ దగ్గరికి వెళ్తాడు. తనేదో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.