English | Telugu

దెయ్యంతో చాట్ చేసిన బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్స్

ఎప్పుడైనా మీరు దెయ్యాన్ని చూసారా..పోనీ మాట్లాడారా..పోనీ అది మీతో మాట్లాడిందా..కానీ బ్రహ్మముడి సీరియల్ లో హమీదకి ఈ దెయ్యం ఎక్స్పీరియెన్స్ అయ్యిందట..వాళ్ళ బ్రహ్మముడి షూటింగ్ లొకేషన్ లో దెయ్యం ఉన్నట్టు డిటెక్ట్ చేసింది హమీద .."ఎన్టైటి డిటెక్టెడ్" అనే యాప్ మన సెల్ లో ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఉన్న లొకేషన్ లో దెయ్యం ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. మరి ఇప్పుడు బ్రహ్మముడి షూటింగ్ లొకేషన్ లో దెయ్యం ఉన్నట్టుగా అక్కడ ఆ యాప్ డిటెక్ట్ చేసింది.

ఇక బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్స్ ఆ దెయ్యంతో చాట్ చేశారు .."ఆ దెయ్యం పేరు బెడ్సి , అది ఆడ దెయ్యం అంట.. అది చాల మంచి దెయ్యం అంట.. ఆ దెయ్యం ఎలా చనిపోయిందో కూడా మెసేజ్ వచ్చింది ఆ దెయ్యం పుట్టిన దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లమ్ కారణంగా చనిపోయినట్లు" చెప్పింది ఆ దెయ్యం. ఇక హమీద తన గత ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పింది. "ఆ యాప్ నా సెల్ లో ఐదేళ్ల నుంచి ఉందట. ఇంతకు ముందు నేను ఒక ఇంట్లో ఉండేదాన్ని.. అక్కడ కూడా ఈ యాప్ తో దెయ్యాన్ని డిటెక్ట్ చేసాను. అక్కడ దెయ్యం ఉందని తెలిసి ఆ ఇంటిని ఖాళి చేసేసాను..

ఆ ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల ఫీలింగ్స్ కలిగేవి నాకు. నెగటివ్ వైబ్ అనిపించేది. దాంతో నేను నా యాప్ తో దెయ్యాన్ని డిటెక్ట్ చేసాను. అప్పుడు ఆ ఇంట్లో దాదాపు 20 ఏళ్ళ నుంచి ఒక దెయ్యం పిల్ల ఉంటోందట..అది చెప్పిన భాష వేరే లాంగ్వేజ్ లో ట్రాన్స్లెట్ అయ్యి మనకు మెసేజ్ వస్తుంది." అని చెప్పింది హమీద..ఇక వాళ్ళ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఒక బొమ్మ చాలా డేంజర్ గా ఉందని చెప్పింది. షూటింగ్ లొకేషన్ లో దెయ్యం ఉందని డిటెక్ట్ అయ్యాక కరెంటు పోయిందట, కర్టెన్ పడిపోయిందట, బాడీ మొత్తం కూడా చాలా నీరసంగా అనిపించిందట, ఏమన్నా హెల్ప్ చేయమంటారా అని కూడా ఆ దెయ్యం అడిగిందట...ఇక వాళ్లకు ఆ దెయ్యం ఉందని తెలిసేసరికి ఆ రూమ్ ని ఖాళి చేసి వేరే రూమ్ ని తీసుకున్నారు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్స్.