English | Telugu

బొమ్మ బ్లాక్ బస్టర్... ఏడాది పూర్తి చేసుకున్న బ్రహ్మముడి !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ప్రస్తుతం ఈ సీరియల్ కి ఫ్యాన్ బేస్ భారీగా ఉంది. ఎంతలా అంటే కార్తీకదీపం సీరియల్ తర్వాత మళ్ళీ అంతటి ఫాలోయింగ్ ఈ సీరియల్ కే దక్కింది.

బ్రహ్మముడి సీరియల్ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ సీరియల్ కనకం-కృష్ణమూర్తిల కుటుంబానికి దుగ్గిరాల కుటుంబానికి మధ్య సాగే సన్నివేశాలన్నీ అందరికి బాగా కనెక్ట్ అయ్యాయి. నీపా అలియాస్ కనకం తన పర్ఫామెన్స్ తో అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. కావ్య అలియాస్ దీపిక రంగరాజుకి తెలుగులో మొదటి సీరియల్ అయిన తెలుగింటి అమ్మాయిలాగా బాగా చేస్తోంది. హమీద అలియాస్ స్వప్న నెగెటివ్ రోల్ లో చక్కగా ఒదిగిపోయింది. అదే బాటలో రాహుల్ అలియాస్ శ్రీకర్ కృష్ణ కూడా రుద్రాణికి కొడుకుగా ఆకట్టుకుంటున్నాడు. తల్లి బాటలో ఎత్తుకి పైఎత్తు వేస్తూ బ్రహ్మముడి సీరియల్ ని ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇప్పుడు ఈ సీరియల్ లో కొత్త క్యారెక్టర్స్ అనామిక, శ్వేత, కావ్య వాళ్ళ బావల ఎంట్రీలతో మరింత ఉత్కంఠభరితంగా మారింది.

అయితే బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ మొదలై సంవత్సరం పూర్తి చేసుకుందని రాహుల్ అలియాస్ శ్రీకర్ కృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వ్లాగ్ ద్వారా తెలియజేసాడు. అయితే ఇందులో బ్రహ్మముడి సీరియల్ వన్ ఇయర్ అయినందున స్టార్ మా పరివారం షో కోసం వీళ్ళంతా వెళ్ళారని, అది బ్రహ్మముడి సీరియల్ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ సెలబ్రేషన్ అని శ్రీకర్ చెప్పాడు. షూటింగ్ అని పిలిచి పొద్దున్నే ఏడింటికి లొకేషన్ కి వస్తే తొమ్మిదింటికి షో మొదలెట్టారని, సాయంత్రం నాలుగైన తినడానికి ఏమీ ఇవ్వలేదంటు శ్రీకర్ నీరసంగా చెప్పుకొచ్చాడు. ఇక శ్రీకర్ అతనితో పాటు నటించే అప్పు, కనకం, కావ్య, అపర్ణ, ధాన్యలక్ష్మిలతో‌ కలిసి సరదాగా మాట్లాడించాడు. అందులో కొత్త క్యారెక్టర్ శ్వేతతో శ్రీకర్ తో కలిసి శతమానం భవతి సీరియల్ లో కూడా నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక హమీదతో కలిసి కబుర్లు చెప్తూ సరదాగా వ్లాగ్ ని చేశాడు. ఈ సీరియల్ మొదలై అప్పుడే సంవత్సరం ముగిసిందా అని ఇందులో నటిస్తున్న వాళ్ళంతా చెప్తున్నారని శ్రీకర్ కృష్ణకి కూడా అలాగే ఉందని చెప్పుకొచ్చాడు. మరి బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్బంగా ఈ సీరియల్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.