English | Telugu
Brahmamudi : హాస్పిటల్ లో కావ్య.. తనకి అబార్షన్ చేయమని చెప్పిన దుగ్గిరాల కుటుంబం!
Updated : Oct 25, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -860 లో..... కావ్య ఇంట్లో అందరికి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. నీకేం బాధగా లేదా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఎందుకు బాధ, ఇన్నిరోజులు నా భర్త ఎందుకు అలా చేస్తున్నాడో అన్న దిగులు ఉండేది కానీ ఇప్పుడు తెలిసింది కదా అని కావ్య అంటుంది. ఇప్పుడు అబార్షన్ చేసుకోమని ఇందిరాదేవి చెప్తుంది. లేదు చేసుకోనని కావ్య చెప్తుంది. నా బిడ్డ బ్రతికితే చాలు అని కావ్య వెళ్ళిపోతుంది. విన్నారుగా అందుకే ఇన్నిరోజులు ఈ విషయం తనకి చెప్పలేదు. నా భార్య పూర్తి ఆయుష్ తో నాకు కావాలని రాజ్ అంటాడు.
ఆ తర్వాత సీతారామయ్య దగ్గరికి కావ్య కాఫీ తీసుకొని వెళ్తుంది. అతను కూడా కావ్యకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ కావ్య అలాగే మూర్ఖంగా ఉంటుంది. మరొకవైపు రాహుల్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఏంటి మీ భార్యకి విడాకులు ఇస్తానన్నావ్ ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది. నీకు కావలసింది విడాకులే కదా తనకి విడాకులు ఇచ్చాకే నీ దగ్గరికి వస్తానని రాహుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి భర్త వచ్చి మనకి అప్పులు చాలా ఉన్నాయని అంటాడు. కొద్దీ రోజులు వాడిని నా ట్రాప్ లో పడేసి ఆస్తులన్నీ లాక్కుంటానని అమ్మాయి తన భర్తకి చెప్తుంది.
మరొకవైపు ఇంట్లో వాళ్ళందరూ కావ్యని మార్చాలని తనతో ఎవరు మాట్లాడవద్దనుకుంటారు. అప్పుడే కావ్య ప్రసాదం తీసుకొని వస్తుంది. ఎవరు తీసుకోరు.. మాట్లాడరు. కావ్య వెళ్లిపోతుంటే కళ్ళు తిరిగిపడిపోతుంది. తరువాయి భాగంలో కావ్య ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. కావ్య స్పృహ లో లేదు కదా అబార్షన్ చెయ్యండి అని ఇంట్లో వాళ్ళు డాక్టర్ కి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.