English | Telugu

Brahmamudi : నగలు దొంగతనం చేసింది రాహుల్.. అప్పు, స్వప్నల ఇన్వెస్టిగేషన్ షురూ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -765 లో.... రాజ్ కి బాస్ లాగా ట్రైనింగ్ ఇస్తుంది కావ్య. అందరిలో ఆఫీస్ లో ఎలా నడవాలి.. ఎలా తినాలి.. ఇలా ప్రతీది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా రుద్రాణి చూసి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రాజ్ ఆఫీస్ కి రాకుండా చేయమని యామినికి చెప్తుంది రుద్రాణి. మరొకవైపు స్వప్న దగ్గరికి అప్పు వస్తుంది. అక్క నీకు ఎలా కనిపిస్తున్నాను.. గిల్టీ నగలు ఇచ్చి నన్ను మెరుగు పెట్టించమని ఇచ్చావని అప్పు అనగానే స్వప్న షాక్ అవుతుంది.

ఏం మాట్లాడుతున్నావే అవి తాతయ్య గారు ఇచ్చిన ఏడు వరాల నగలు అని స్వప్న అనగానే.. చూడు ఒకసారి వీటిని ఒరిజినల్ నగలు అంటారా అనగానే స్వప్న వాటిని చూసి షాక్ అవుతుంది. రాహుల్ నగలు లోపల పెట్టేటప్పుడు చూసింది గుర్తు చేసుకొని అసలు రాహుల్ ఆల్రెడీ నగలు తీసుకొని గిల్టీ నగలు పెడుతుండగా చూసా కానీ అప్పుడు నగలు దొంగతనం చేస్తున్నాడని గొడవ అయిందని స్వప్న అంటుంది. నా మొగుడు ఎలాంటి వాడో చూసావా అని స్వప్న బాధపడుతుంది. అసలు రాహుల్ నగలు తియ్యాల్సిన అవసరం ఏంటి? మనం ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని అప్పుతో స్వప్న అంటుంది. మరొకవైపు కావ్యతో రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు.

ఆ తర్వాత స్వప్న కావాలనే లాకర్ కీస్ రాహుల్ కి కనపడేలా పెడుతుంది. కావాలనే అప్పుతో ఫోన్ లో మాట్లాడినట్లు చేస్తుంది. అప్పు నాతో మాట్లాడాలి అంట నేను వెళ్తున్నాను.. పాపని చూడమని రాహుల్ తో స్వప్న అనగానే రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్వప్న వెళ్ళగానే లాకర్ నుండీ ప్రాపర్టీ పేపర్స్ తీసుకొని రాహుల్ వెళ్తాడు. అదంతా అప్పు, స్వప్న చూస్తారు. అసలు రాహుల్ ఏం చేస్తాడో చూడాలని ఇద్దరు అనుకుంటారు. మరుసటి రోజు రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. రాజ్ రాగానే శృతి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.