English | Telugu
Brahmamudi : భర్తని ఆషాడం గోరింటాకు పెట్టమన్న భార్య.. వారసుడు కావాలని అత్త డిమాండ్!
Updated : Jul 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -464 లో.... కావ్య స్టేషన్ కి వచ్చి అప్పు ఏ తప్పు చెయ్యలేదు.. వాళ్లే తప్పుగా మాట్లాడారు, కావాలంటే రికార్డు ఉందని కావ్య అనగానే.. ఆ అబ్బాయిలు భయపడి మాదే తప్పు హోటల్ బుక్ చేస్తా వస్తావా అని అన్నామని ఒప్పుకుంటారు. దాంతో ఇన్స్పెక్టర్ అప్పుని బయటకు పంపించి అబ్బాయిలని సెల్లో వేస్తాడు. మా మరిది కూడా కోపంలో అలా చేసాడని కావ్య అనగానే.. కళ్యాణ్ ని కూడా వదిలేస్తారు. మరి అన్నయ్య అని కళ్యాణ్ అనగానే.. వచ్చేముందు అన్నారు.. నాకు ఇన్ ఫ్లూయెన్స్ చాలా ఉందన్నారు అని కావ్య అంటుంది.
ఆ తర్వాత ఇది టైమ్ చూసి కొడుతుందని రాజ్ అనుకుంటాడు. ఆయనకు కమీషనర్ తెలుసు.. మీరు మా ఆయనకి ఫోన్ ఇస్తే కమీషనర్ కి కాల్ చేస్తాడని కావ్య అంటుంది. అవునా మీకు కమీషనర్ తెలుసా ఫోన్ వద్దులే కానీ వదిలేస్తామని రాజ్ ని కూడా వదిలేస్తారు. దాంతో అందరు బయటకు వస్తారు. ఏంటే అప్పు ఎందుకు ఇలా చేస్తున్నావ్.. ఊరికే ఇలా స్టేషన్ చుట్టూ తిరిగితే అందరు ఏమనుకుంటారని కావ్య అంటుంది. ఏం చేయమంటావ్ అక్క.. వాడు వల్గర్ గా మాట్లాడుతుండు.. రోజు ఇంటికి వచ్చిన వాళ్ళు మీ అమ్మాయి హోటల్ లో దొరికిందంట కాద డబ్బున్న వాణ్ణే పట్టిందని అంటున్నారు.. అలా అంటే అమ్మ నాన్నలకి ఎలా ఉంటుందని అప్పు ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
ఆ తర్వాత కావ్య గోరింటాకు తీసుకొని వచ్చి.. రాజ్ ని పెట్టమని అడుగుతుంది. ఇప్పుడు ఎందుకని రాజ్ అడుగుతాడు. ఇప్పుడు ఆషాడం కదా.. అందుకే అమ్మాయి లు పెట్టుకుంటారని కావ్య అంటుంది.ఆ తర్వాత కావ్యకి రాజ్ గోరింటాకు పెడుతుంటే.. ఇక్కడ దురద లేస్తుంది. అక్కడ దురద పెడుతుందంటూ కావ్య అంటుంది. రాజ్ చిరాకు పడతాడు. ఆ తర్వాత కావ్యని రాజ్ రొమాంటిక్ గా చూస్తుంటే అప్పుడే అతనికి ఫోన్ వస్తుంది. కాసేపటికి నా వల్లే అప్పుకి ఇలాంటి పరిస్థితి అంటూ కళ్యాణ్ ఆలోచిస్తుంటే.. అప్పుడే రాజ్ వచ్చి.. నువ్వు ఇలా ఉంటే ఎలారా అని అంటాడు. అప్పు బాధ్యత నాది అని కళ్యాణ్ అంటాడు. ఏం చేస్తావ్.. అసలు నీకు ఏదైనా చేసిలే ఛాన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారా అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలోచించి మీ జీవితం నాశనం చేసుకుంటున్నారు నీ కడుపు పండాలని కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.