Read more!

English | Telugu

Guppedantha Manasu : నీ లైఫ్ నీ ఒక్కదానిదే కాదు.. మనుది కూడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1045 లో..  లెటర్ రాసి వెళ్ళిపోదామనుకున్న అనుపమని ఎక్కడికి వెళ్ళకుండా వసుధార, మహేంద్ర ఆపేస్తారు. ఇంటికొచ్చిన అనుపమతో మహేంద్ర మాట్లాడుతుంటాడు. నువ్వు వెళ్లిపోవాలనేది నా ఉద్దేశం కాదు అనుపమా.. నువ్వు హ్యాపీగా ఉండాలి.. ఇక్కడే ఉండాలి.. ప్రతి ఒక్కరికీ జీవితంలో గడ్డు పరిస్థితులు ఉంటాయి. జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. కొన్ని నెలలక్రితం నేను.. నాతో పాటు వసుధార గడ్డుపరుస్థితుల్ని ఎదుర్కొన్నాం.. ఒక్కొక్కరిదీ ఒక్కో టైమ్ అని మహేంద్ర అంటాడు.

ఇంతలో వసుధార వచ్చి.. అవును మేడమ్.. జగతి మేడమ్ చనిపోయిన తరువాత మేమందరం చాలా రోజులకు కానీ.. మామూలు మనుషులం కాలేకపోయాం. మామయ్య అయితే మందుకి బానిస అయ్యారు. ఆ టైమ్ లో దేవయాని అన్న మాటల వల్ల ఇంట్లో గొడవలు జరిగి బయటకు వచ్చేశామని రిషి ఉన్నప్పుడు జరిగిన ఇష్యూని చెప్తుంది. రిషి లేకుండా వసుధార చాలా పెయిన్ అనుభవిస్తుంది. మను వచ్చిన తరువాత అయితే చాలా ఎక్కువే పెయిన్‌ని అనుభవిస్తుందని అనుపమతో మహేంద్ర అంటాడు. సర్ లేకపోయినా.. వస్తారనే ఆశతో బతుకుతున్నా.. బతుకుతో పోరాడుతున్నా.. మీరు కూడా.. ఓపిగ్గా ఉండండి మేడమ్.. మీ సమస్య తీరిపోతుందని అనుపమతో వసుధార అంటుంది. నా సమస్య తీరేది కాదు.. నా సమస్య ఏంటో మీకు తెలియదని అనుపమ అంటుంది. అందుకే కదా చెప్పమని అడుగుతుంటా.. ఏదైనా అడిగితే మౌనమే సమాధానం అంటావని అనుపమతో మహేంద్ర అంటాడు.

ఒక్కటి గుర్తుపెట్టుకో అనుపమ.. నీ లైఫ్ నీ దొక్కదానిదే కాదు.. మనుది కూడా.. నీ లైఫ్‌లో ఏం జరిగినా అది మనుపై ప్రభావం చూపిస్తుంది. అది మంచి అయిన చెడు అయిన.. ఇప్పుడు మీరిద్దరూ ఎలాగైతే మాట్లాడకుండా ఉన్నారో.. ఒకప్పుడు రిషి, జగతిలు కూడా ఇలాగే ఉండేవారు. కానీ వాళ్లిద్దరూ కలిశారు. నువ్వు మను కూడా కలుస్తారని మహేంద్ర ధీమాగా చెప్తాడు. ఇక కాలేజ్‌లో బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మను రాకపోయేసరికి.. స్వయంగా శైలేంద్రని వెళ్లి మనుని తీసుకుని రమ్మని చెప్తాడు ఫణింద్ర. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.