English | Telugu

స్వప్న గదిలో రాహుల్... పూజ చేసిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -115 లో.. రాజ్ స్నానానికి వెళ్లగానే నీళ్లు రాకపోవడంతో బయట ఉన్న కావ్యని వాటర్ కావాలని రిక్వెస్ట్ చేస్తాడు. మీరు నాకు రాత్రంతా నిద్ర లేకుండా చేసినందుకు సారీ చెప్పండి అప్పుడే వాటర్ ఇస్తానని కావ్య అంటుంది. సరే సారీ చెప్తున్న ఇదే లాస్ట్ సారి అని రాజ్ అంటాడు. అప్పుడు కావ్య బకెట్ వాటర్ తీసుకెళ్ళి రాజ్ కి ఇస్తుంది.

మరొకవైపు కనకం దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. కనకం వాళ్ళ అక్క కనకం ని చూసి.. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావని అడుగుతుంది. కావ్య అత్తింటి వాళ్ళు రాహుల్ స్వప్నలకి పెళ్లి చేస్తామని మాట ఇచ్చారు కానీ ఎప్పుడు? ఏంటని? ఏం మాట్లాడలేదని కనకం అంటుంది. అప్పుడే కనకం వాళ్ళింటికి రాహుల్ వస్తాడు. రాహుల్ ని చూసిన అప్పు.. నువ్వు ఎందుకు వచ్చావ్ అని ఆవేశపడుతుంది. చేసిన తప్పు కి క్షేమించమని అడుగుదామని వచ్చానని రాహుల్ చెప్తాడు. కనకం మౌనంగా ఉంటుంది. "స్వప్న ఎక్కడ వుంది ఆంటీ? నన్ను క్షమించమని తనని అడగాలి" అని రాహుల్ అడుగగా.. ఆ గదిలో ఉందని కనకం చెప్తుంది. మరొకవైపు వంట చేస్తున్న కావ్య దగ్గరికి ధన్యలక్ష్మి వచ్చి.. వంట కాదు నువ్వు చెయ్యాలిసింది పూజ అని కావ్యని తీసుకెళ్తుంది. కావ్యని చూసిన అపర్ణ‌‌.. ఏంటి ధాన్యలక్ష్మి తనని ఎందుకు తీసుకొచ్చావని అడుగగానే.. ఇంటి కోడలు పూజ చెయ్యాలి కదా.. ఇన్ని రోజులు ఇంటికోడలిగా నువ్వు పూజ చేసావ్.. ఇప్పుడు నీకు కోడలు వచ్చింది తనే చెయ్యాలని ధాన్యలక్ష్మితో పాటు అందరూ అంటారు. అపర్ణ మౌనంగా ఉంటుంది. దాంతో కావ్య పూజ చేస్తుంది. "ఇంట్లో నీ స్థానం, హక్కులు, బాధ్యతలు అన్నీ తీసుకున్నా కానీ నిన్ను నా కోడలిగా ఎప్పటికీ ఒప్పుకోను" అని అపర్ణ అంటుంది. కిచెన్ లోకి వెళ్ళాను.. పూజ గదిలోకి వెళ్ళాను.. మీ కొడుకు గదిలోకి కూడా వెళ్ళాను.. మీరు కూడా నన్ను కోడలిగా ఒప్పుకునే రోజు త్వరలోనే వస్తుందని అపర్ణతో కావ్య అంటుంది.

మరొకవైపు స్వప్న దగ్గరికి వెళ్లిన రాహుల్.. కావ్య గురించి చెడుగా చెప్తాడు. నేను నీకోసం ఇల్లు వదిలి రావడానికి కూడా సిద్ధం.. ఎప్పుడైతే నా కొడుకు నీ కడుపులో పెరుగుతున్నాడని తెలిసినప్పటి నుండి నాకు ఆస్తి కంటే నువ్వే ముఖ్యమని తెలిసింది. మీ చెల్లికి ఆస్తి ముఖ్యం. ఎక్కడ నువ్వు ఆ ఇంటికి వస్తే తనకు అడ్డుగా ఉంటావేమోనని మీ చెల్లి ప్లాన్ చేసిందని రాహుల్ అంటాడు. రాహుల్ దుగ్గిరాల ఇంటి నుండి వెళ్ళిపోకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలని స్వప్న అనుకుంటుంది. మరొకవైపు రాజ్ కావ్యల మధ్యలో ఎప్పటిలాగే మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.