Read more!

English | Telugu

కాపురం చేయట్లేదని కృష్ణ, మురారిలని తిట్టిన రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -176 లో... కృష్ణ, మురారి పిల్లలతో సరదాగా గడుపుతారు. మురారి, కృష్ణ ఇంటికి బయల్దేరి వస్తుండగా.. అక్కడున్న పిల్లలు మురారి గురించి మాట్లాడం గుర్తు చేసుకుంటుంది కృష్ణ. "నా పక్కన సదా సిద్ధంగా ఉంటున్న ఏసీపీ సర్ తన సంపాదనలో కొంచెం పిల్లల బాగోగులకు ఖర్చుపెడుతున్నారు. ఇప్పుడు నా మనసులో మీపై గౌరవం మరింత పెరిగింది" అని మనసులో అనుకుంటుంది కృష్ణ. మురారి కూడా కృష్ణ గురించి అలానే అనుకుంటాడు.

మరొకవైపు ముకుంద తన ఫ్రెండ్ తో..  కృష్ణ, మురారి లది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పాను.. నా ప్రేమని ఆదర్శ్ కోసం మురారి త్యాగం చేసాడని చెప్పానని ముకుంద తన ఫ్రెండ్తో చెప్తుంది. ఇదంతా విన్న మీ రేవతి అత్తయ్య ఎలా బరించిందని ముకుందని వాళ్ళ ఫ్రెండ్ అడుగగా.. ఆ ఇంట్లో వాళ్ళ గుండెలు స్ట్రాంగ్ గా ఉంటాయని ముకుంద అంటుంది. ఇక కృష్ణ అగ్రిమెంట్ పూర్తి కాగానే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారిని పెళ్లి చేసుకుంటా అని ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది.

మరొకవైపు కృష్ణకి మురారి ఐస్ క్రీం ఇష్టమని ఒక దగ్గర కార్ ఆపి కొనిస్తాడు. ఇంట్లో ఉన్న రేవతి.. ముకుంద అన్న మాటలన్నీ గుర్తు చేసుకొని టెన్షన్ పడుతుంది. అప్పుడే అక్కడకి మధు, అలేఖ్యలు వస్తారు. ఏమైంది పెద్దమ్మ అని మధు, అలేఖ్యలు అడుగుతారు. కాసేపటికి ఇంటికి వచ్చిన కృష్ణ, మురారిలు.. ఏమైంది అని రేవతిని అడుగుతారు. వాళ్ళని పట్టించుకోకుండా రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. 

అందురు భోజనం చేస్తుంటారు. "ఎందుకు అత్తయ్య అలా ఉన్నారు" అని రేవతిని కృష్ణ అడుగుతుంది. నీ వల్లే ఇలా ఉన్నానని రేవతి అనగానే.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. పక్కనే ఉన్న మురారి.. ఏం అయింది మమ్మీ అని అనగానే.. "నువ్వు కూడా" అని మురారిని అంటుంది. మేమేం చేసాం మమ్మీ అని మురారి అడుగుతాడు. మీరు కాపురం చెయ్యట్లేదు.. పెళ్లి అయి ఇన్ని నెలలు అవుతున్న ఇంకా పిల్లలు లేరని రేవతి ఆవేశపడుతుంది.

ముకుంద ఒక్కసారి షాక్ అవుతు.. ఏంటి అత్తయ్య అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అడుగుతుందా? ఏంటి? అనుకుంటే ఇలా అంటుంది అనుకుంటుంది. నాకు మనవడో మనవరాలో కావాలి. కృష్ణ నిన్ను డాక్టర్ కి చూపిస్తాను.. వాన్ని మీ సీనియర్ డాక్టర్ కి చూపించు అని రేవతి గట్టిగా మాట్లాడేసరికి.. కృష్ణ మురారి లు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.