English | Telugu

మాయాబజార్ లా మారిన కావ్య, రాజ్ కథ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -153 లో.. స్వప్న చేసే పనుల గురించి వాళ్ళ అమ్మ కనకంకి చెప్పాలని రుద్రాణి అనగానే... వద్దు స్వప్నని జాగ్రత్తగా చూసుకోవడం అత్తింటి వారీగా మన బాధ్యత అని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. అసలు ఈ ఇంట్లో ఏది జరిగిన మన వల్లే అన్నట్లుగా చూస్తున్నారని రాహుల్ తో రుద్రాణి అంటుంది. దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని రుద్రాణి అనుకుంటుంది.

మరొకవైపు అప్పుకి కళ్యాణ్ హెల్ప్ చెయ్యాలని.. బేకరి ఓనర్ దగ్గరికి వచ్చి.. అప్పుకి పిజ్జా ఆర్డర్ డెలివరీ ఇప్పిస్తాడు. మరొక వైపు రాజ్ తన గదిలో చూసిన డిజైన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సేమ్ డిజైన్స్ నా గదిలో దొరికాయంటే కావ్య తప్ప వేరే వాళ్ళు వేసే ఛాన్స్ లేదని రాజ్ అనుకుంటాడు. అప్పుడే శృతి డిజైన్స్ తీసుకొని వచ్చి రాజ్ కి చూపిస్తుంది. ఇవి ఆ కావ్య వేసిన డిజైన్స్ అని నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు. ఇంత బాగా వేసిన ఆ అమ్మయిని అభినందించాలి, ఒకసారి ఆ అమ్మాయికి ఫోన్ చెయమని శృతితో రాజ్ అనగానే శృతి టెన్షన్ పడుతుంది. వెంటనే ఫోన్ తీసుకొని కావ్య పేరుని శిరీష అని ఎడిట్ చేస్తుంది. ఆ తర్వాత కావ్యకి శృతి ఫోన్ చేసి శిరీష.. నీతో సర్ మాట్లాడుతాడట అని శృతి చెప్పగానే కావ్య టెన్షన్ పడుతుంది. ఫోన్ ఇచ్చి నువ్వు వెళ్ళు, నేను మాట్లాడడం అయిపోయాకా పిలుస్తా అని రాజ్ అనగానే శృతి వెళ్ళిపోతుంది. మాట్లాడేది కావ్య అని తెలిసిన రాజ్.. "చాలా బాగా వేశారండి డిజైన్స్. మా ఆవిడ ఉంది.. తనకి చుక్కల ముగ్గు తప్ప ఏది రాదు" అని కావాలనే రాజ్ మాట్లాడతాడు. అలా వేరేవాళ్ళ ముందు మీ భార్య గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది. నా భర్త అలాంటోడు, ఇలాంటోడని కావ్య కూడా కావాలనే మాట్లాడుతుంది. ఆ తర్వాత నువ్వు బయటపడనప్పుడు నేను ఎందుకు బయటపడతా...డిజైన్స్ ఎవరు వేస్తున్నారో బయట పెడతా అని రాజ్ తనలో తాను అనుకుంటాడు.

మరొకవైపు స్వప్న కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. అందరూ కంగారుపడతారు. డాక్టర్ కి ఫోన్ చేస్తారు. మరొక వైపు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అప్పు వస్తుంది‌. పిజ్జా తీసుకొని డబ్బులు ఎక్కువ ఇవ్వు అని చెప్తాడు. కళ్యాణ్ ఫ్రెండ్ పిజ్జా తీసుకొని డబ్బులు ఎక్కువ ఇస్తుంటే అప్పు తీసుకోకుండా వెళ్ళిపోతుంది. మరొక వైపు డాక్టర్ వచ్చి స్వప్నని చూసి నీరసం వల్లే ఇలా అయిందని చెప్తుంది. నాకు కావలిసింది చేసి పెట్టట్లేదని కావ్యని స్వప్న అంటుంది. ఎప్పుడు నీకు నచ్చినవి చేస్తుంది కదా కావ్య అని రాజ్ తనకి సపోర్ట్ గా మాట్లాడుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.