English | Telugu

కృష్ణ పెళ్లి మురారీతో కాదు..!

ఇదేం ట్విస్ట్ రా మామా.. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో మురారి పెళ్లి చేసుకుంది కృష్ణనే కదా.. మరి కాదంటే ఎలా అనుకుంటే పొరపాటే. అసలు విషయం ఏంటంటే సీరియల్ లో కృష్ణ పాత్రని చేస్తున్న ప్రేరణ కంబం పెళ్లి నిన్న జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇన్ స్ట్రాగ్రామ్ లోని కృష్ణ ముకుంద మురారి పేజీలో షేర్ చేసారు. కాగా ఇప్పుడు కృష్ణ పెళ్ళి ట్రెండింగ్ లో ఉంది.

స్టార్ మా సీరియల్స్ లో టాప్-5 లో కృష్ణ ముకుంద మురారీ సీరియల్ ఒకటి. ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సీరియల్ లో మొదట విదేశాలలో ముకుంద, మురారి ఇద్దరు ప్రేమించుకుంటారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు ఇండియాకి వచ్చేస్తారు‌. అయితే ముకుంద, మురారి ఇద్దరికి వేరు వేరు వ్యక్తులతో పెళ్ళి జరుగుతుంది. ముకుంద పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు మురారి సోదరుడు ఆదర్శ్ నే.. ఇదే అసలు ట్విస్ట్ . ఇక పెళ్ళి జరిగిన మరుసటి రోజునే ఆదర్శ్ మిలటరీలోకి వెళ్లిపోతాడు. ఇక ఆదర్శ్ కోసం ఎదురు చూడకుండా మురారిని ఎలాగైనా దక్కించుకోవాలని ముకుంద ప్రయత్నిస్తుంటుంది‌‌. ఇక మురారి పెళ్లి చేసుకున్న కృష్ణ.. అమాయకురాలు, తింగరిది. అయితే పెళ్ళికి ముందు ముకుంద మురారి ప్రేమించుకున్నారని కృష్ణకు తెలుస్తుంది. కానీ కృష్ణని మురారి పెళ్ళి చేసుకున్నాక తన ప్రేమలో పడతాడు మురారి. అయుతే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్స్ లలో... మురారికి యాక్సిడెంట్ అయి మొహం పాడయిందని
ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. దాని తర్వాత అతనికి గుర్తుకు రాడు. ఇక గతం గుర్తుచేపించడనానికి అమెరికాకి పంపిస్తున్నట్టుగా భవాని చెప్తుంది.

శ్రీపధ్ దేష్ పాండే, ప్రేరణ కంబం ల పెళ్లి ఫోటో, వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది. అయితే బుల్లితెరపై ఆన్ స్క్రీన్ పై కృష్ణ మురారి ల జంట ఎంత హిట్టో అందరికి తెలిసిందే. అయితే బయట ఆఫ్ స్క్రీన్ లో ప్రేరణ, శ్రీపధ్ లు ఒక్కటయ్యారు. కాగా ఈ సీరియల్ అభిమానులు కొత్త జంటకి కంగ్రాట్స్ చెప్తున్నారు.