English | Telugu
బిగ్ బాస్ హౌస్ లో బాటమ్-3 ఎవరు?
Updated : Oct 8, 2023
బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడు లేనటువంటి ట్విస్ట్ లు బిగ్ బాస్ సీజన్-7 లో జరుగుతున్నాయి. ఉల్టా పల్డా థీమ్ తో అదరగొడుతున్నాడు బిగ్ బాస్.
శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చీ రాగానే కంటెస్టెంట్స్ ఆటతీరుని చూపెడుతూ ఒక్కో బడ్డీ చేసిన తప్పులని చూపించాడు. ఇక ఇందులో శుక్రవారం నాడు ఏం జరిగిందో బిగ్ స్క్రీన్ మీద చూపించాడు. ఆట సందీప్ తన వరెస్ట్ స్ట్రాటజీనీ శుభశ్రీ దగ్గర ప్లే చేశాడు. గౌతమ్ కృష్ణ గురించి నెగెటివ్ చెప్తూ అడ్డంగా దొరికపోయాడు ఆట సందీప్. నాగార్జున అన్నీ మిస్టేక్స్ చెప్పినా.. అవన్నీ నా స్ట్రాటజీ అని లైట్ తీసుకున్నాడు శివాజీ. ఇక యావర్-టేస్టీ తేజలని చూసి ముచ్చటేసిందని నాగార్జున అనగా.. ఇద్దరు థాంక్స్ చెప్పారు. ఇక సంఛాలక్ గా ప్రియాంక జైన్ ఫెయిల్ అయిందని, తన నిర్ణయాన్ని ఆట సందీప్ వాదనతో మార్చుకుందని నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత దొంగల టాస్క్ కోసం అందరూ రెడీ అవుతున్నప్పుడు.. ప్రశాంత్ దొంగ గెటప్ లో భాగంగా మొహం మీద గాటు పెట్టుకున్నాడంట అని సందీప్ అనగా.. వాడు గాటు పెట్టుకోవడమెందుకు నిజంగానే దొంగలా ఉంటాడు కదా అని అమర్ దీప్ అన్నాడు. ఇక శుభశ్రీ నిల్చొని.. మేమంతా గేమ్ ఆడుతున్నవేళ.. టేస్టీ తేజ, అమర్ దీప్, గౌతమ్ కలిసి ఫ్రిడ్జ్ లోని కోక్ లు అన్నీ దొంగతనం చేశారని చెప్పింది. ఇక అది విన్న నాగార్జున.. పల్లవి ప్రశాంత్ కెప్టెన్ కాబట్టి వారికి విధించే శిక్షేంటో అతడికే వదిలేద్దామని నాగార్జున అన్నాడు.
ఇక హౌజ్ మేట్స్ కాకుండా కంటెస్టెంట్స్ గా ఉన్నవారిలో ఎవరు అన్ డిజర్వింగ్ అనిపిస్తున్నారో బాటమ్-3 చెప్పండని నాగార్జున అడిగాడు. అమర్ దీప్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ అన్ డిజర్వింగ్ అని శివాజీ అన్నాడు. ఆట సందీప్, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్ అంతా కలిసి నన్ను టార్గెట్ చేస్తూ ఆడుతున్నారు. అది నాకు నచ్చలేదని సూటిగా అన్ డిజర్వింగ్ అని చెప్పేశాడు శివాజీ. ఇక ఇలా ఒక్కొక్కరుగా వచ్చి బాటమ్-3 ఎవరో చెప్పుకొచ్చారు. హౌజ్ లోని కంటెస్టెంట్స్ ప్రకారం గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, టేస్టీ తేజ బాటమ్-3 లో ఉన్నారు. మరి అఫీషియల్ ఓటింగ్ లో ప్రియాంక జైన్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ బాటమ్-3 లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపటి ఎపిసోడ్‌లో చూద్దామని నాగార్జున అన్నాడు.