English | Telugu

చీటీ చదివిన కావ్య ఎక్కడికి వెళ్ళింది.. అప్పుకి మిగిలింది శోకమేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -221 లో.. అప్పు కోసం కనకం బయటకు వస్తుంది. అప్పు బయట డల్ గా కూర్చొని ఉంటుంది. ఏమైంది భోజనం చేద్దాం లోపలికి పదా అని అప్పుతో కనకం అనగానే.. నేను రానంటూ అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కనకం లోపలికి వెళ్తుంది. అప్పు ఎక్కడ అని ఇంట్లో వాళ్ళు అడుగుగా తలనొప్పిగా ఉందంట, అందుకే వెళ్లిపోయిందని కనకం చెప్తుంది.

ఆ తర్వాత అందరు కింద కూర్చొని భోజనం చేస్తుంటారు. కావ్య రాజ్ లు పక్కపక్కన కూర్చొని తింటుంటే కనకం సంబరపడుతుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి.. ఇందాక అందరిముందు ఓవర్ చేస్తున్నావేంటని రాజ్ అడుగుతాడు. అందరి ముందు అయితేనే మీరేమీ అనరు కదా అని కావ్య అంటుంది. అందరు మనం కలిసిపోయామని అనుకుంటారని రాజ్ నోరు జారుతాడు. ఏంటి ? అంటే మీరు కలిసిపోవడానికి ట్రై చేస్తానని అన్నారు కదా అని కావ్య అనగానే.. రాజ్ మళ్ళీ డైవర్ట్ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత కావ్య ఒంటరిగా బయట కూర్చొని రాజ్ రాసిన చీటీ ఓపెన్ చేసి చదువుతుంది. అందులో "నేను కావ్యతో ప్రేమగా ఉంటుంది కేవలం తాతయ్యకి ఇచ్చిన మాట కోసమే" అని రాజ్ అందులో రాసి ఉంటాడు. అలా రాజ్ రాసింది చూసి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. రాజ్ ఇన్ని రోజులు ప్రేమగా ఉన్న సందర్బాలన్నీ గుర్తుకు చేసుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత కావ్య కోపంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది.

మరొక వైపు కనకం, కృష్ణమూర్తి లు ఇంటికి వెళ్తారు. అప్పు కోపంగా నాకు ఆకలిగా ఉందని, వంట చేయమని కనకంకి చెప్తుంది. ఏంటి ఈ మధ్య అప్పులో మార్పు వచ్చిందని కృష్ణమూర్తితో కనకం అంటుంది. ఆ తర్వాత అప్పు దగ్గరికి అన్నపూర్ణ వెళ్లి.. అప్పు నువ్వు కళ్యాణ్ ని ప్రేమిస్తున్నావ్. నాకు తెలుసు కానీ వాళ్ళిద్దరు(కావ్య, స్వప్న) ఆ ఇంట్లోనే ఉన్నారు. నువ్వు కళ్యాణ్ ని ప్రేమిస్తున్నట్లు తెలిస్తే వాళ్ళ పరిస్థితేంటి, ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను ఆ ఇంటి కోడళ్ళని చేశారని మీ నాన్నని ఎన్ని మాటలు అన్నారో చూసావ్ కదా అని అప్పుతో అన్నపూర్ణ అనగానే.. నువ్వు అనుకుంటున్నట్టు అదంతా ఏం లేదని అప్పు అంటుంది. నువ్వు అదేం చెప్పకు. నాకు తెలుసు మంచి నిర్ణయం తీసుకోమని అన్నపూర్ణ అనగానే.. అప్పు ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. అప్పు లిఫ్ట్ చెయ్యదు. మరొక వైపు కావ్య ఇంకా గదిలోకీ రాకపోయే సరికి రాజ్ కిందకి వెళ్లి కావ్యని చూస్తాడు. కావ్య ఎక్కడ కన్పించదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.