English | Telugu
Divya Buzz interview: నా అన్నయ్య భరణి..ఈ ఒక్క విషయంలో నా మనసు మాట వినలేదు!
Updated : Nov 30, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండో వారం దివ్య ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా మూడు వారాల గేమ్ మిగిలి ఉంది. దివ్య ఎలిమినేషన్ వెనుక చాలా కారణాలున్నాయి. తను స్ట్రాంగ్ అయినప్పటికీ హౌస్ లో ఎవరి సపోర్ట్ లేకపోవడం.. ఆడియన్స్ తన బాండింగ్ అర్థం చేస్కోకపోవడం.. భరణి కుటుంబమే దూరం పెట్టడం.. అన్నింటికి మించి దివ్యకి ఓట్ బ్యాంకింగ్ లేకపోవడం పెద్ద మైనస్ అయి బయటకొచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక శివాజీతో బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది దివ్య.
తనూజ మీద ఇప్పుడు నీ ఒపినీయన్ ఏంటమ్మా అని అడుగగా.. తను చాలా పొసెసివ్.. ముద్దుముద్దుగా మాట్లాడుతుంది. కానీ నచ్చినవాళ్ళతోనే.. నచ్చకపోతే దూరం పెట్టేస్తుంది. భరణి, తనూజ విడిపోడానికి కారణం నువ్వేనని అంటున్నారని శివాజీ అడుగగా.. నాకేవసరం సర్ వాళ్ళని విడగొట్టడానికి, నేను వాళ్ళని విడగొట్టి ఏం సాధిస్తాను.. పోనీ నేను వచ్చానని చెప్పి విడిపోయే అంత వీక్ ఆ వాళ్ళు.. ఆయన ఏం రాస్తే మనకెందుకమ్మ.. ఆయన ఆంటిమెంట్ రాస్తాడు.. ఎత్తుకొని తిప్పుతాడు. అతను పిల్లాడు కాదు..నీకేంటమ్మా ప్రాబ్లమ్ అని శివాజీ అడుగగా.. నా దగ్గరకి ఓ మనిషి వచ్చి ఈ బాధ ఉందని చెప్పారనుకోండి అని దివ్య ఏదో చెప్పబోతుంటే.. భరణి చెప్పకపోయినా మీకు బాధ తెలుస్తుంది అది కదా మా బాధ అని శివాజీ అడుగగా... దివ్య సైలెంట్ అయిపోయింది. భరణి బయటకెళ్ళి మళ్ళీ వచ్చాక నిన్ను అంత ఎంకరేజ్ చేయలేదు అబ్జర్వ్ చేశావా అని శివాజీ అడుగగా.. అవును గమనించానని దివ్య అంది. మరి అప్పుడన్న అర్థం చేసుకోవాలి కదా అమ్మ అని శివాజీ అనగానే దివ్య షాక్ అయింది. మీ మమ్మీ ఏం చెప్పిందో తెలుసా.. దివ్యని భరణి గారికి దూరంగా ఉండమని చెప్పమ్మా అనగానే నాకు తెలియదని దివ్య అంది.
అసలు భరణితో ఎందుకంతా .. నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా అని శివాజీ అడుగగా.. నా అన్నయ్య.. మళ్ళీ వెనక్కొచ్చారు.. ఆయనతో ఉండాలి.. ఆయనని బాగా చూస్కోవాలి.. అయనతో గేమ్ బాగా ఆడాలి.. ఇదే ఇంటెన్షన్ తో ఉన్నాను.. బయటకెళ్ళాక కూడా ఆయన నాతో ఎలా ఉంటారో తెలియదు కానీ నేను మాత్రం వందశాతం ఆయన బాగు కోరుకునే వ్యక్తిగానే ఉంటానని ఏడ్చేసింది దివ్య. ఈ ఒక్క విషయంలోనే నా మనసు నా బ్రెయిన్ మాట వినలేదని దివ్య అనగా నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావమ్మ అని శివాజీ టిష్యూ ఇచ్చాడు. తను జెన్యున్ ప్లేయర్ అని ఆడియన్స్ అందరికి తెలుసు.. కానీ భరణితో ఇంత అటాచ్ మెంట్ ఉందని ఈ బజ్ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. మరి దివ్య ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.