English | Telugu

దివ్య, కళ్యాణ్ ల మధ్య చిచ్చుపెట్టిన తనూజ

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు జరిగిన దాంట్లో లేడీ కంటెస్టెంట్స్ లో దివ్య టాప్. ఎందుకంటే తను స్ట్రాటజీలు వాడుతుంది.. గేమ్ ఆడుతుంది.. అందరితో బాగుంటుంది. కానీ మన బిగ్ బాస్ మామ తనూజనే విన్నర్ ని చేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకే తను ఎంత ఇరిటేట్ అయిన అవేం చూపించకుండా ఫేక్ ఓటింగ్ వేస్తూ తనూజ టాప్(Tanuja Fake) అన్నట్టుగా చూపిస్తున్నారు బిగ్ బాస్. ఒకవేళ మేల్ కంటెస్టెంట్స్ అయితే కళ్యాణ్ ని విజేత చెయ్యాలని గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకేనేమో స్ట్రాంగ్ అండ్ జెన్యున్ కంటెస్టెంట్ అయినటువంటి దివ్య, డీమాన్ పవన్ లాంటి కంటెస్టెంట్స్ ని ఛాన్స్ దొరికినప్పుడే బ్యాడ్ చేయాలని వీడియోలు ప్లే చేసి మరీ చూపిస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్ లో దివ్యని కార్నర్ చేస్తూ వీడియోలు వేసి చూపించి కళ్యాణ్, తనూజ దృష్టిలో దివ్యని బ్యాడ్ చేశాడు బిగ్ బాస్ మామ. దివ్య ట్రైన్ టాస్క్ లో భరణికి సపోర్ట్ చేస్తూ తనూజని తీసేయ్యమని గౌరవ్ తో చెప్తుంది. అది వీడియో చూపించాడు నాగ్‌. దాంతో తనూజ దివ్యపై ఓ అభిప్రాయం ఏర్పర్చుకుంది. దివ్య ఎవరిని గెలిపించాలనేది తన ఆట.. తన ఆట గురించి ఎవరికీ ఏ అభ్యంతరం ఉండకూడదు.. కానీ నీ బాధ ఏంటంటే మాట ఇచ్చి మాట తప్పింది అని అంతేకదా అని కళ్యాణ్ ని నాగార్జున అడుగగా‌.. కొంచెం సర్ అని కళ్యాణ్ అన్నాడు. ఎవరికి వాళ్ల ఫేవరెట్స్ ఉంటారు కదా.. డీమాన్‌కి రీతూ కావాలని ఉంటుంది.. ఇంకెవరికో ఇమ్మాన్యుయల్ కావాలని ఉంటుంది.. నీకు తనూజ కావాలని ఉంది.. అది వాళ్ల ఛాయిస్‌ల బట్టి ఉంటుంది.. ఎవరిని గెలిపించాలనేది వాళ్ల ఇండివిజల్ ఛాయిస్ అని నాగార్జున అన్నాడు. అంటే దివ్య అలా మాట ఇచ్చి తప్పే రకం కాదు.. కానీ ఆ టైమ్‌లో తను ఇమ్మూ-తనూజ మధ్య ఓటింగ్ పడుతుందేమో అనుకొని అలా చేసి ఉండొచ్చని కళ్యాణ్ చెప్పాడు.

నేను చూపించిన వీడియో టాస్క్ స్టార్ట్ కాక ముందు.. ఒకరికి గెలిపించడానికి మనం సపోర్ట్ చేయడం, టాస్కులో ప్రాణం పెట్టడమనేది కరెక్ట్.. ఖచ్చితంగా అది చేయాలి.. కానీ ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరి ఓటమి కోసం ఉండకూడదంటూ సోది చెప్పాడు నాగ్ మామ. హౌస్ లో ఓ గేమ్ జరిగితే ఒకరు ఓడిపోతేనే ఇంకొకరు గెలుస్తారు.. అది బేసిక్ కదా.. ఇదంతా ఎందుకు.. తనూజ‌ని దివ్య తీసేసింది కాబట్టి తనూజ, దివ్య, కళ్యాణ్ ల మధ్య చిచ్చుపెట్టి దివ్యకి సపోర్ట్ లేకుండా చేసి తనని పంపించేద్దామని ప్లాన్ చేశామని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా బిగ్ బాస్ మామ.. దివ్య ఆడిన ఆటతీరు కరెక్ట్ కానీ దానిని బిగ్ బాస్ మామ చూపించిన తీరు రాంగ్ అని మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.