English | Telugu

బిగ్ బాస్ సీజన్-8 రన్నర్ గా గౌతమ్.. ఓడినా టఫ్ ఫైట్ ఇచ్చాడు!

బిగ్‌బాస్ సీజన్-8లో విన్నర్ ఎవరనే విషయం తెలిసిపోయింది. 105 రోజులపాటు ఆడియన్స్‌ని అలరించిన బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. ఇక టైటిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న గౌతమ్‌కి రన్నరప్ మాత్రమే మిగిలింది. కానీ సీజన్-8లో మస్త్ పోటీ అయితే ఇచ్చాడు గౌతమ్. చివరి నిమిషం వరకూ ఎవరు గెలుస్తారా అంటూ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూసేలా గౌతమ్ ఆట ఆడాడు. అయితే ఓటింగ్ విషయంలో చాలా తక్కువ డిఫరెన్స్‌లోనే గౌతమ్ ఓడిపోయినట్లు తెలుస్తోంది.

గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వకపోయి ఉంటే నిఖిల్ విన్నర్ అని ఆడియన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయేవారు. కానీ గౌతమ్ రావడం.. టైటిల్ రేసులో నిలవడంతో ఆడియన్స్‌కి మరో ఆప్షన్ వచ్చింది. అయితే చివరి నిమిషం వరకూ టఫ్ ఫైట్ ఇచ్చిన గౌతమ్.. చాలా తక్కువ డిఫెరన్స్ ఓటింగ్‌తో టైటిల్ కోల్పోయాడు. బిగ్‌బాస్ సీజన్-8 రన్నరప్‌గా నిలిచాడు. వైల్డ్ కార్డ్‌తో వచ్చి వైల్డ్ ఫైర్‌ అయ్యాడు గౌతమ్. పడిలేచిన కెరటంలా.. ఎలిమినేషన్‌తోనే గౌతమ్‌ని బిగ్ బాస్ చావు దెబ్బ కొట్టాడు. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి గౌతమ్ హౌస్‌లో ఉన్నాడు లేడంటే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలని ఎంతోమంది ట్రోల్స్ చేశారు. ఇలా సేవ్ చేయడం కంటే.. ఎలిమినేట్ చేసినా బాగుండేదని గౌతమ్ తనలో తాను బాధపడ్డాడు. అయితే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదన్నట్టుగా.. జీరో నుంచి హీరోగా మారాడు. ఎలిమినేషన్ నుంచి బిగ్ బాస్ ఎలవేషన్ ఇచ్చేంతగా టాప్-5 కి చేరి విన్నర్ రేస్‌లోకి వచ్చి రన్నరప్ అయ్యాడు.

గౌతమ్ ఐదో వారంలో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సీజన్ 8 రన్నరప్ అయ్యాడు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి రావడం వల్లే గౌతమ్‌ ఓటింగ్‌లో కాస్త వెనుకబడ్డాడు. నిజానికి రెగ్యులర్ కంటెస్టెంట్‌లో వచ్చి ఉంటే ఖచ్చితంగా గౌతమ్‌ టైటిల్ కొట్టేవాడేమో. అతడికి బయట భారీగా ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇండివిడ్యువల్ ప్లేయర్ అంటూ గౌతమ్ కి ఓ ట్యాగ్ కూడా ఉండనే ఉంది. ఈ సీజన్-8లో జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ జాబితాలో గౌతమ్ కూడా ఒకడు.