English | Telugu
Rathika Eliminated : రతిక ఎలిమినేటెడ్.. షాక్ లో కంటెస్టెంట్స్!
Updated : Nov 26, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కొత్త ట్విస్ట్ లు, టాస్క్ లు కామన్ గా జరుగుతున్నాయి. పన్నెండు వారాల ఆట ముగిసింది. ఇందులో ఆట సందీప్, టేస్టీ తేజ, పూజామూర్తి, నయని పావని, శుభశ్రీ రాయగురు, భోలే షావలి, కిరణ్ రాథోడ్, దామిణి, షకీల, ఎలిమినేట్ అయ్యారు. ఇక పన్నెండవ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం నాటి ఎపిసోడ్‌లో అశ్వినిశ్రీ, ఆదివారం నాటి ఎపిసోడ్‌లో రతిక ఎలిమినేట్ అయ్యింది.
రతిక సీజన్ ప్రారంభంలో వచ్చి సరిగ్గా ఆడలేక, కంటెంట్ కోసం ఫేక్ లవ్ అంటూ డ్రామాలు చేసి ఫుల్ నెగెటివిటి తెచ్చుకొని బయటకొచ్చింది. అయితే ఈ సీజన్-7 ఉల్టా పుల్టా కాబట్టి బయటకొచ్చిన దామిణి, శుభశ్రీరాయగురు, రతికలికి రీఎంట్రీ కోసం ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ముగ్గురిలో ఎవరైతే హౌస్ లోకి రావాలని అనుకుంటున్నారో వారికి మీ ఓటు వేయండి అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే హౌస్ లోకి తక్కువ ఓట్లు వచ్చిన రతికని తీసుకొచ్చాడు బిగ్ బాస్. హౌస్ లోకి వచ్చాక గేమ్స్ బాగా ఆడతాను, ఇక నుండి నేనేంటో చూపిస్తాను అని చెప్పిన రతిక పెద్దగా యాక్టివ్ గా లేదు. కంటెంట్ కోసం పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి, లేనిపోనివి మాట్లాడతంతో మరింత నెగెటివిటి తెచ్చుకుంది. ఇక టాస్క్ లలో ఒక్కదానిలో కూడా యాక్టివ్ పర్ఫామెన్స్ లేదు. దాంతో పాటు హౌస్ మేట్స్ చిరాకు తెప్పించింది.
ఫ్యామిలీ వీక్ లో రతిక వాళ్ళ నాన్న వచ్చి.. గేమ్స్ బాగా ఆడు, ఎవరితో గొడవ పెట్టుకోవద్దని చెప్పిన ఫాలో అవ్వలేదు. ఇక నిన్నటి సండే ఫన్ డే ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న అందరిని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. చివరగా అంబటి అర్జున్, రతిక మిగిలారు. ఇక ఒక ప్రింటర్ లో ఎలిమినేట్ అయ్యే వారి ఫోటో ప్రింట్ అవుతుందని నాగార్జున చెప్పగా కాసేపటికి రతిక ఫోటో ప్రింట్ అయింది. దీంతో రతిక యూ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేశాడు నాగార్జున .ఆ తర్వాత హౌస్ లోని వారికి బై చెప్పేసి వచ్చేసింది. స్టేజ్ మీదకొచ్చాక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ కి కొన్ని సలహాలు ఇచ్చి బయటకు వచ్చేసింది రతిక.