English | Telugu
Rathika Remuneration: రతిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
Updated : Nov 26, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో లవ్ ట్రాక్ నడిపిన వారిలో రతిక ఒకరు. మొదట పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపిన రతిక,ఆ తర్వాత యావర్ తో కొనసాగించింది.
రతిక ఎలిమినేషన్ తో యావర్ కాస్త నిరాశ చెందినట్టు తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ని రతిక కోసం వాడనని , పద్నాలుగవ వారం వాడుతానని నిన్న నాగార్జున అడిగినప్పుడు చెప్పాడు. ఇక రతికని బిగ్ బాస్ యాక్టివిటి ఏరియాకి పిలిచి.. " ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికెళ్ళావోచ్ " అనే పాటని చాలాసార్లు ప్లే చేసి వినిపించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ పాటని విన్న రతికకి.. ఇందులో ఉడతలు ఎన్ని ఉన్నాయని ఒకే ఒక క్వశ్చన్ వేయగా.. సరిగ్గా లెక్క చేసి చెప్పింది రతిక. దీంతో రతిక సో ఇంటలిజెంట్.. ఈ సీజన్-7 టాప్-5 లో ఉంటుందని అనుకున్నారంతా కానీ ఆ తర్వాత రతిక ఏ టాస్క్ లోను అంతగా రాణించలేకపోయింది. మొన్నటి డైస్ గేమ్ లో క్యూబ్స్ ని సెట్ చేసే టాస్క్ లో రతిక ఆలోచించే టైమ్ లోనే పల్లవి ప్రశాంత్ తన ఆటని ముగించాడు. ప్రతీదానికి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల తన గేమ్ లో వెనుకపడిపోయేది. ఇక టాస్క్ లో అనవసరపు కారణాలకు గాను తోటి హౌస్ మేట్స్ తో గొడవ పడుతుండేది రతిక.
మొదట ఎలిమినేషన్ అయి బయటకు వచ్చిన రతికను ప్రేక్షకులు బాగా ట్రోల్స్ చేసారు. ఇక గ్రాంఢ్ లాంచ్ 2.0 తర్వాత వారం స్పెషల్ ఎంట్రీగా వచ్చిన రతిక ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది. గతవారం జరిగిన నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి చెప్పిన రీజన్ చాలా సిల్లీగా అనిపించింది. ఇక అమర్ దీప్ తో గొడవకి దిగడం అందులో అంత ఇంపార్టెంట్ అనిపించేదేది లేవడంతో తను కంటెంట్ కోసమే ఇదంతా చేస్తుందని తెలుస్తుంది. రోజుకి 28 వేల చొప్పున వారానికి 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. మొత్తం తొమ్మిది వారాలకి గాను 18 లక్షల వరకు రతిక రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పన్నెండవ డబుల్ ఎలిమినేషన్ లో అశ్వినిశ్రీ తర్వాత రతిక ఎలిమినేట్ అయింది. ఇక హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలారు.