English | Telugu

మూడో రోజు నామినేషన్లో ఉన్న ఆ ఏడుగురు కంటెస్టెంట్లు ఎవరు?

బిగ్ బాస్ మూడవ రోజు "హాత్ లగా దేంగే" పాటతో మొదలైంది. రోహిత్ మరియు మెరీనా ఒక జంటలా అడుగుపెట్టిన కారణంగా, ఒక జంటలానే బయటకు వెళ్తారని, జంటగానే ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. ఎవరిని ఇంటికి పంపించాలనుకుంటున్నారో వారి పేరు రాసి ఫ్లష్ చేయండని బిగ్ బాస్ చెప్పాడు. రేవంత్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు.

ఫైమాని, ఆరోహిని నామినేట్ చేసాడు రేవంత్. నేను చూసింది మాత్రమే చెప్తున్నాను. నా పాయింటాఫ్ లో నాకు ఏదైతే అనిపించిందో అదే చేసానని రేవంత్ చెప్పుకొచ్చాడు. తర్వాత రేవంత్‌ని, చంటిని సుదీప నామినేట్ చేసింది. తర్వాత రేవంత్‌ని, అర్జున్‌ని ఫైమా నామినేట్ చేసింది.

ఫైమాకి సమాధానంగా.. రేవంత్ నెగెటివ్ అయ్యాడని మోటివేట్ చేసానని అర్జున్ చెప్పుకొచ్చాడు. రేవంత్, శ్రీసత్యని నామినేట్ చేసింది ఫైమా. ఆరోహి, ఫైమాని అర్జున్ నామినేట్ చేసాడు. అర్జున్ నీ చూపుల్లో చాలా అర్థాలు ఉన్నాయని ఆరోహి అంది. ఇది తనకు నచ్చలేదని అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నామినేట్ చేసారు.

చివ‌ర‌గా, "ఆరోహీ, శ్రీసత్య, చంటి, రేవంత్, ఇనయ, అభినయశ్రీ, ఫైమా నామినేషన్లో ఉన్నారు." అని బిగ్ బాస్ చెప్పాడు.