English | Telugu

అంతమంది సెలబ్రిటీస్ వచ్చినా 'బిగ్ బాస్ 5 ఫినాలే' రేటింగ్ తక్కువే!

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ డిసెంబర్ 19 న గ్రాండ్ గా ముగిసింది. ఐదో సీజర్ విన్నర్ గా వీజే సన్నీ నిలిచాడు. అయితే ఎంతో ఘనంగా జరిగిన బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేటింగ్ మునుపటి రికార్డులను తిరగ రాస్తూ భారీగా వస్తుందని భావించారంతా. కానీ గత సీజన్లతో పోల్చితే తక్కువ టీఆర్పీ నమోదు చేసి బిగ్ బాస్ ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేసింది.

బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ఎప్పుడు లేనంతగా భారీగా గెస్ట్ లు తరలివచ్చారు. రాజమౌళి, రణబీర్ కపూర్, ఆలియా భట్, నాని, నాగ చైతన్య, శ్రియ, ఫరియా అబ్దుల్లా ఇలా ఎందరో సందడి చేశారు. దీంతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రికార్డు టీఆర్పీ వస్తుందని అనుకున్నారంతా. కానీ గత సీజన్ల టీఆర్పీతో పోల్చితే తగ్గింది. బిగ్ బాస్ మొదటి నాలుగు సీజన్ల టీఆర్పీ గమనిస్తే '14.13, 15.05, 18.29, 19.51' ఇలా ప్రతి సీజన్ కి పెరుగుతూ వచ్చింది. ఈ సారి గెస్ట్ లు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో గత రెండు సీజన్ల స్థాయిలో రేటింగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 16.04 కి పరిమితమైంది.

16 అనేది మంచి రేటింగే అయినప్పటికీ గత సీజన్లతో పోల్చితే తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి త్వరలో ఆరో సీజన్ ని ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి రికార్డు రేటింగ్ వచ్చేలా ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.