English | Telugu

Guppedantha Manasu: గుప్పెడంత మనసులో హ్యాపీ డేస్.. అదే కారణం! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -928 లో.. వసుధార ఒంటరిగా అనుపమ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. ఏంటి అనుపమ.. మేడమ్ అలా మాట్లాడుతున్నారు. దేవయాని గారు ఏమైనా నా గురించి నెగెటివ్ గా చెప్పారా అందుకే అలా మాట్లాడారా.. అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే అలాంటి ఉండకుండా చూసుకోవాలి. లేదంటే మా మధ్యలో విబేధాలు వస్తాయని వసుధార అనుకుంటుంది.

ఆ తర్వాత వసుధార దగ్గరికి రిషి వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావు. అనుపమ గారి గురించేనా అని అనగానే.. అవునని వసుధార అంటుంది. ఆవిడ రావడంతో డాడ్ లో మార్పు వచ్చింది. ఇన్నిరోజులు తెలియని ఇష్టాలు తెలిసాయి. అందుకే మేడమ్ ని వస్తూ ఉండమని చెప్పానని రిషి అంటాడు. మేడన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారో అని వసుధార అనగానే.. తన జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఉన్నాయో మనకి తెలియదు కదా అని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళ్తారు. హాల్లో ఫోన్ చూస్తూ మహేంద్ర హ్యాపీగా ఉండడం చూసిన రిషి, వసుధార సంబరపడతారు. మీలో ఏదో మార్పు వచ్చిందని రిషి అనగానే.. లేదు ఎప్పటిలాగే ఉన్నానని మహేంద్ర అంటాడు. మరొకవైపు అనుపమకి దేవయాని ఫోన్ చేసి మాట్లాడుతుంది. అనుపమ మహేంద్రని కలిసిన విషయం చెప్తుంది. ఇక కావాలనే దేవయాని.. వసుధార పైన నెగెటివ్ ఇంప్రెషన్ రావాలని అనుకొని ఆ వసుధారతో జాగ్రత్త అని మరి మరి చెప్పగానే.. ఎందుకు అలా చెప్తున్నావ్ అని అనుపమ అడుగుతుంది.

మరుసటి రోజు ఉదయం కాలేజీలో ఒక అబ్బాయి, అమ్మాయిని లవ్ చేస్తున్నానంటూ వెంటపడితే వసుధార ఆ అబ్బాయి చెంప పగులగొడుతుంది. ఆ తర్వాత రిషి వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు ధరణి కాఫీ తీసుకొని వచ్చి ఫణింద్ర, దేవయాని, శైలేంద్రలకి ఇస్తుంది. శైలేంద్ర కాఫీ బాగుందంటూ ధరణిని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఇంట్లో ఒక పనిమనిషిని పెట్టించి.. ధరణి, శైలేంద్రలని బయటకు కొన్ని రోజులు ఎంజాయ్ చేయడానికి పంపిస్తున్నానని ఫణింద్ర దేవయానికి చెప్తాడు. ధరణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవయాని మాత్రం ఇప్పుడు ఎందుకని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.