English | Telugu
అద్దిరిపోయిన న్యూ బిగ్ బాస్ హౌస్ లుక్
Updated : Jun 7, 2022
బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 6కి రెడీ అయ్యింది. ఐతే ఇంతకుముందు సీజన్స్ లో కనిపించిన బిగ్ బాస్ హౌస్ కి, కొత్త హౌస్ కి చాలా డిఫరెన్స్ కనిపించబోతోంది. లివింగ్ రూమ్, గ్లాస్ డైనింగ్ టేబుల్, ఫర్నిచర్ అద్దిరిపోయాయి. అందమైన రంగురంగుల కళ్ళు ఉన్న ఫొటోస్ ని గోడలకు తగిలించారు. మంచి పోష్ ఫర్నిచర్ ని ఈ సీజన్ లో యూజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. "బీ స్పెషల్" అనే కాప్షన్ ఉన్న ఇంగ్లీష్ లెటర్స్ బాగా హైలైట్ అయ్యేలా సెట్ చేశారు. ఇంకా గార్డెన్, కిచెన్, బీబీ కేఫ్ మొత్తం అందమైన సెట్టింగ్ తో గ్రాండ్ లుక్ వచ్చేలా ఏర్పాటు చేశారు. వాష్ రూమ్ డోర్స్ మంచి కలర్ తో, మంచి కొటేషన్స్ తో తీర్చిదిద్దారు.
ఓవరాల్ గా బిగ్ బాస్ న్యూ హౌస్ లుక్ మాత్రం అద్దిరిపోయిందని చెప్పొచ్చు. కామన్ మాన్ కి ఎంట్రీ వచ్చింది కాబట్టి ఫైనల్ లిస్ట్ లో ఎవరెవరు ఈ ఇంట్లోకి వెళ్ళబోతున్నారో, ఎంత మస్తీ చేస్తారో అనే విషయం వేచి చూడాలి. ఐతే.. లేటెస్ట్ సీజన్ ని ఓటిటిలో కాకుండా ఇదివరకు సీజన్స్ లా టీవీలో ప్రసారం చేస్తే బాగుంటుంది.. అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. మంచి ఫర్నిచర్ కూడా వాడి హౌస్ కి సూపర్బ్ లుక్ ఇచ్చారని కూడా అంటున్నారు.