English | Telugu

హ‌మీదా, అఖిల్ మ‌ధ్య‌ ఇష్యూని పెంచ‌డానికి ట్రై చేసిన న‌ట‌రాజ్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో ఈ వారం అంతా అనుకున్న‌ట్టే నాలుగో వికెట్ ప‌డింది. నాలుగ‌వ వారం ఇంట్లో ఎన్నో గొడ‌వ‌లు జ‌రిగాయి. ముఖ్యంగా బిందు మాధ‌వి, అఖిల్ మధ్య గొడ‌వ ప‌తాక స్థాయికి చేరి ఆడా.. ఈడా అనుకునే దాకా వెళ్లారు. హ‌మీదా కూడా త‌ను చేయాల్సినంత ర‌చ్చ చేసింది. అఖిల్ త‌న ప్రైవేట్ పార్ట్ ని ట‌చ్ చేశాడంటూ హ‌మీదా చేసిన రాద్ధాంతం వైర‌ల్ గా మారి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏ స్థాయికి దిగ‌జారిందో స్ప‌ష్టం చేసింది.

ఈ వివాదంపై హోస్ట్ నాగార్జున త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది? ఎవ‌రు చేశారో క్లారిటీ తెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌రువాత హ‌మీదా, అఖిల్ ల‌ని క‌న్ఫెష‌న్ రూమ్ లోకి పిలిపించి వారితో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అయితే అఖిల్ ఫైన‌ల్ గా త‌న త‌ప్పుని ఒప్పుకుని ఆట‌లో అలా జ‌రిగిపోయింద‌ని, త‌ను కావాల‌ని టచ్ చేయ‌లేద‌ని చెప్పాడు. దీంతో హ‌మీదా కూడా కూల్ అయింది. అయితే న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఈ ఇష్యూని మ‌రింత పెంచేలా మాట్లాడ‌టంతో వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేసింది. ఇది గ‌మ‌నించిన నాగార్జున అస‌లు ఏం జరిగిందో వీడియో వేసి చూపించాడు.

వెంట‌నే అషురెడ్డి మ‌ధ్య‌లో దూరి హ‌మీదా అలా చెప్ప‌డం క‌రెక్ట్ కాదంది. మీ స‌మ‌స్య‌ను మీరు సాల్వ్ చేసుకోవాలి.. మ‌ధ్య‌లో వేరే వాళ్లు వ‌స్తే ఇలానే వుంటుంది అని నాగార్జున అన్నారు. ఫైన‌ల్ గా హ‌మీదా - అఖిల్ ల ర‌చ్చ‌కు తెర‌ప‌డింది. హ‌మీదాకు అఖిల్ సారీ చెప్పాడు. త‌రువాత ఇద్ద‌రూ హ‌గ్ చేసుకున్నారు. ఇక ఈ వారం స‌ర‌యు ఎలిమినేట్ అయింది. స్టేజ్ పైకి వ‌చ్చిన స‌ర‌యు .. తేజ‌స్వి, అఖిల్‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ల‌కు చుర‌క‌లంటించింది. రివార్డ్‌, వాంటెడ్ బోర్డ్ ల‌తో స‌ర‌యు చేత‌ నాగార్జున ఓ ఆట ఆడించారు. త‌న‌కు న‌చ్చిన వాళ్లు హ‌మీదా, మ‌హేష్ విట్టా, అఖిల్ అని చెప్పింది స‌ర‌యు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.