English | Telugu
లవ్ చేసిన వాళ్ళనే నటరాజ్ మాస్టర్ హర్ట్ చేస్తారు
Updated : Mar 27, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ నాలుగో వారం పూర్తి చేసుకుంది. నాలుగో వారం ఊహించినట్లుగానే సరయు ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ ఐదో సీజన్ లో మొదటి వారమే ఎలిమినేట్ అయిన సరయు.. బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగు పెట్టింది. దీనిలో కూడా ఆమె మొదటి వారమే ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరగగా.. చివరికి ఆమె నాలుగో వారం ఎలిమినేట్ అయింది.
17 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన నాన్ స్టాప్ నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్, రెండో వారం శ్రీరపాక, మూడో వారం ఆర్జే చైతు ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం సరయు బయటకు వచ్చేసింది. సరయు వెళ్లడంతో ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు.
ఇదిలా ఉంటే ఎలిమినేషన్ తరువాత స్టేజ్ మీద తేజస్వీ, అరియనా, నటరాజ్ మాస్టర్ లకు సరయు చురకలంటించింది. తేజు స్క్రీన్ స్పేస్ కోసం చూస్తున్నట్టు అనిపిస్తుందని కౌంటర్ వేసింది. అరియానా మాటలు అని కనీసం రిగ్రెట్ కూడా కాదని కామెంట్ చేసింది. నటరాజ్ మాస్టర్ అయితే ఆయనకు సపోర్ట్ చేసిన వారినే బాధపెడుతుంటారు, ఎవరు ఎక్కువ లవ్ చేస్తారో వాళ్లనే వాళ్లనే హర్ట్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. హమీదా, మహేష్ తనకి ఎంతో అండగా ఉన్నారని.. అఖిల్ కూడా సపోర్ట్ చేశాడని కానీ అతను గుంపు నుంచి బయటకు రావాలని సరయు చురకవేసింది.