English | Telugu
బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వివాదం కాదుగా..
Updated : Feb 16, 2022
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీని కారణంగా కొన్ని జంటలు విడిపోవడం.. కొంత మంది మధ్య మనస్పర్థలు తలెత్తడం తెలిసిందే. అయితే ఈ షో ఎంత వివాదాలని సృష్టించిందో అంతే పాపులారిటీని కూడా సొంతం చేసుకుంది. ఇప్పటికీ అదే పంథాని కంటిన్యూ చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలోనూ ప్రసారం కాబోతోంది. అయితే ఈ సారి ట్రెండ్ మార్చారు. గంట నిడితో కాకుండా 24 గంటలు స్ట్రీమింగ్ కాన్సెప్ట్ తో వస్తున్నారు.
తాజాగా ఓటీటీ బిగ్‌బాస్ షోకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ఓటీటీ బిగ్‌బాస్ షోకు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరింస్తున్నారు. నాగార్జున, వెన్నెల కిషోర్, మురళీశర్మలపై బిగ్‌బాస్ ఓటీటీ ప్రమోషనల్ ప్రోమోని వదిలారు. ఇందులో వెన్నెల కిషోర్ దొంగ పొరపాటున ఓ వ్యక్తిని మర్డర్ చేస్తాడు. అతన్ని పట్టుకున్న మురళీశర్మ కోర్టులో హాజరు పరిస్తే అతని తరుపున వాదించే లాయర్ గా నాగార్జున కనిపించారు. ఫైనల్ గా వెన్నెల కిషోర్ కి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది.
అతని శిక్షని ఎలాగైనా తప్పించాలని ప్రయత్నించే లాయర్ నాగార్జున అతని చివరి కోరికగా బిగ్‌బాస్ ఎపిసోడ్ ని చూపించండి అని మురళీశర్మని కోరతాడు. గంటే కదా అని ఓకే అంటాడు. కానీ ఇది 24 గంటలలు స్ట్రీమింగ్ అయ్యే షో కావడంతో ఎంతకీ పూర్తవ్వదే అని ముందు అసహనం వ్యక్తం చేసినా ఆ తరువాత వెన్నెల కిషోర్, నాగార్జునతో కలిసి తను కూడా చూడటం మొదలుపెడతాడు. ఉరిశిక్ష వేయాల్సిన తలారీ, శిక్ష వేసిన జడ్జి, సెంట్రీగా వుండాల్సిన పోలీసులు కూడా కర్తవ్యాన్ని పక్కన పెట్టి షోని చూడటం మొదలుపెడతారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : 'బిగ్ బాస్' ఫేమ్ 'సరయు' అరెస్ట్!
ఇలాంటి ప్రోమోలపై విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. మరి బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో కూడా వివాదం అయ్యే అవకాశాలు వున్నాయని చెప్పుకుంటున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ షో ఈ నెల 26 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.