English | Telugu
ఆర్యవర్థన్ చాంబర్ లోకి రాగసుధ.. ఏం చేయబోతోంది?
Updated : Apr 16, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. మరాఠీ సీరియల్ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ క్షణ క్షణం ఉత్కంఠతని రేకెత్తిస్తోంది. గత జన్మ జ్ఞాపకాలతో ఆర్య ని వదిలి వెళ్లలేక.. ఆర్యపై మనసు చావక మరో రూపంలో వచ్చిన ఓ అమ్మాయి కథ అంటూ ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ఆసక్తికరంగా సాగుతోంది. తన అక్క హత్య వెనకున్న రహస్యాన్ని చేధించే క్రమంలో రాగసుధ అను సహాయంతో ఆర్య వర్థన్ సామ్రాజ్యం లోకి అడుగుపెడుతుంది. ఈ రోజు ఏం జరిగనుందన్నది ఓ సారి చూద్దాం.
పేరు మార్చుకుని, వేషం మార్చుకుని ఆర్య వర్థన్ ఆఫీసులో చేరిన రాగసుధని గమనించిన మాన్సి అందరి ముందు తన గుట్టు బయటపెట్టాలని, తను పని మనిషి అని ఏదో కుట్రలో భాగంగానే ఇందంతా చేస్తోందని, తనని ఇక్కడి నుంచి బయటికి పంపించాలని మాన్సీ ప్రయత్నిస్తుంది. రాగసుధని గమనించిన వెంటనే తనని నిలదీస్తుంది. తనకు జాబ్ ఎవరిచ్చారని మీరాపై విరుచుకుపడుతుంది. తన మాట ఎవరూ నమ్మకపోయే సరికి చివరికి నీరజ్ ని రమ్మని ఆ రోజు పని మనిషిగా మన ఇంటికి వచ్చింది తనే అని చెబుతుంది.
రాగసుధ ముఖం చూపిస్తే అసలు విషయం తెలిసిపోతుందని తన ముసుగును బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తుంటుంది. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న అను .. రాగసుధ దొరికిపోకుండా జాగ్రత్తపడుతుంది. ఆర్య కూడా ఎవరో అనుకుని పొరపాటు పడినట్టున్నావని మాన్సీని నిలదీస్తాడు. అంతా కూల్ అయిపోవడంతో ఆర్య - అను తన చాంబర్ లో స్వీట్ లు తినిపించుకుంటూ వుంటారు. అదే సమయంలో రాగసుధ చాంబర్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అనుతో సంతకాలు చేయించుకోవాలని చెప్పి ఆర్య చాంబర్ లో సీడీని గాలించడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆర్య టేబుల్ కింద వున్న సీడీ రాగసుధ కంటపడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది?.. ఆర్యకు తెలియకుండానే సీడీని రాగసుధ లేపేసిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.