English | Telugu

బిగ్‌బాస్ ఓటీటీలో స్ర‌వంతి కులాల ర‌చ్చ‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.. దీని కార‌ణంగా రెండు జంట‌లు తీవ్ర ఇబ్బందులుకు ట్రోలింగ్ కు గురైన విష‌యం తెలిసిందే. ఎలాంటి లిమిటేష‌న్స్ లేకుండా వ్య‌క్త‌గ‌త విష‌యాల్లోకి కూడా తొంగిచూసిన బిగ్‌బాస్ షో ఇప్ప‌డు 24 గంట‌ల నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అంటూ ఓటీటీలో మొద‌లైంది. టెలివిజ‌న్ తో పోలీస్తే అక్క‌డ సెన్సార్ అంత‌గా వుండ‌క‌పోవ‌డంతో కంటెస్టెంట్ లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ప‌చ్చిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇప్పుడు మ‌రో వాద‌న కూడా వినిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇంత వ‌ర‌కు బిగ్ బాస్ లో కులాల ప్ర‌స్థావ‌న వినిపించ‌లేదు కానీ బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ బిగ్‌బాస్ నాన్ స్టాప్ లో ఏకంగా ఏ కంటెస్టెంట్ కులాల ప్ర‌స్థ‌వన‌కు నాంది ప‌ల‌క‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 17 మంది కంటెస్టెంట్ ల‌తో మొద‌లైన ఓటీటీ బిగ్ బాస్ షో మొత్తానికి అనుకున్న‌ట్టే ముమైత్ ఖాన్ ఎలిమినేష‌న్ తో ఫ‌స్ట్ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌ని పూర్తి చేసింది. ఇక హౌస్ లో వున్న మిగ‌తా కంటెస్టెంట్ లు బ‌య‌టి కంటే హౌస్ లోనే మ‌రింత మోటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Also Read:ఒకేసారి 20 ఓటీటీ ప్లాట్ ఫాంలలో రిలీజ్.. పూనమ్ కౌర్ సంచలన రికార్డ్

ఇందులో స్ర‌వంతి కూడా ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. స‌హ కంటెస్టెంట్ ల‌తో ప‌చ్చిగా మాట్లాడుతూ హౌస్ లో నానా ర‌చ్చ చేస్తోంది. ఎవ‌రు ప‌చ్చిగా మాట్లాడితే వారికి వీడియోలో ఎక్కువ స్కోప్ వుండ‌టంతో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా వ‌ర‌కు కంటెస్టెంట్ లు ప‌చ్చిగా మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు. యాంక‌ర్ స్ర‌వంతి లాంటి వాళ్లైతే వ్య‌క్తిగత విష‌యాల్ని కూడా చెప్ప‌డం, కులాల ప్రస్థావ‌న తీసుకురావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. త‌న రెండో పెళ్లి గురించి చెప్పిన యాంక‌ర్ స్ర‌వంతి మ‌రింత లోతుగానే మాట్లాడి షాకిచ్చింది. అజ‌య్‌, బిందు మాధవిల‌తో కూర్చుని త‌న కులం గురించి ప్ర‌స్థావించింది. పోను పోను స్ర‌వంతి ఇంకా ఎలాంటి హ‌ద్దుల్ని చెరిపేసి ర‌చ్చ చేస్తుందో న‌ని అంతా అనుకుంటున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.