Read more!

English | Telugu

మేము కలిసే ఉన్నాం.. కలిసి పనిచేస్తున్నాం!


ఆర్జే సూర్య బిగ్ బాస్ కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే టైములో హోస్ట్ నాగార్జున ముందు టాప్ హీరోలను మిమిక్రీ చేస్తూ వావ్ అనిపించాడు. విజయ్ దేవరకొండని మిమిక్రీ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఐతే సూర్య హౌస్‌లో ఎక్కువగా లవ్ ట్రాక్స్ నడుపుతున్నాడని, పులిహోర బాగా కలుపుతున్నాడని తెలుసుకుని ఆడియన్స్ ఆయన్ని బయటికి పంపేశారు. తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌తో తో రెచ్చిపోతూ పోస్టులు పెడుతున్నాడు. 

లేటెస్ట్‌గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" పేరుతో తన ఫ్యాన్స్‌కి ఒక టాస్క్ ఇచ్చాడు. "బిగ్ బాస్ హౌస్‌లో ఎవరంటే ఇష్టం?" అని అడిగిన ప్రశ్నకు "చలాకీ చంటి అంటే ఇష్టం" అని చెప్పాడు. "ఆరోహి, నువ్వు కలిసారా" అని అడిగేసరికి "హా.. కలిశాం, కలిసి వర్క్ చేస్తున్నాం, ఫ్యూచర్‌లో కూడా కలిసే వర్క్ చేస్తాం" అని చెప్పాడు. 

"హౌస్‌లో ఉన్నప్పుడు బుజ్జమ్మ బుజ్జమ్మ అన్నారు.. బయటికి వచ్చాక ఫ్రెండ్ అన్నారు" అని అడిగేసరికి "మా రిలేషన్ మీద మాకు, మా ఫామిలీ మెంబర్స్‌కి చాలా క్లారిటీ ఉంది. బయట వచ్చిన కొన్ని ఆర్టికల్స్ వల్ల తన లైఫ్ ఎఫెక్ట్ అయ్యింది" అని బాధపడుతూ బుజ్జమ్మకు సారీ చెప్పి రిప్లై ఇచ్చాడు. "బీబీ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?" అనేసరికి "చాలా బాగుంది. చేతిలో సెల్ ఫోన్ లేకుండా, తెలియని పర్సన్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం చాలా బాగుంది" అన్నాడు సూర్య.