English | Telugu
Bigg Boss 9 Telugu 12th week Nominations: దివ్య వర్సెస్ భరణి.. తనూజకి ఇచ్చిపడేశాడుగా!
Updated : Nov 25, 2025
బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ రెండు విడతలుగా సాగింది. మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా తనూజని భరణి నామినేట్ చేశాడు. తనూజ, దివ్య ఇద్దరి మధ్య ఏం జరిగినా నా గురించి గొడవ పెట్టుకుంటున్నారు. నిన్న కూడా తనకి ఇష్టం లేకున్నా బలవంతంగా మాట్లాడాలని ట్రై చేస్తున్నావని ఇండైరెక్ట్ గా నా టాపిక్ తీశారని తనూజని భరణి నామినేట్ చేస్తాడు.
ఇక రెండో లెవెల్ నామినేషన్ లో భాగంగా దివ్యని భరణి నామినేట్ చేశాడు. నీకు చాలాసార్లు చెప్పాను. మీరు నాపై ఒక రకమైన ఎఫెక్షన్ చుపిస్తున్నారు కానీ మీకు ఒక విషయం గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎవరు చెప్పిన మీరు పట్టించకోవడం లేదు. మొన్న కూడా వచ్చినప్పుడు చెప్పారని భరణి అంటాడు. ఎవరు చెప్పారని దివ్య అడుగతుంది. రెస్పెక్ట్ గా మాట్లాడమని భరణి కోప్పడతాడు ఎవరు చెప్పారని నేను అడుగతున్నాను కానీ ఎవడు చెప్పాడు అనడం లేదు ప్లీజ్ భరణి గారు ఇది నేషనల్ తెలివిజన్ నన్ను బ్యాడ్ చెయ్యకండి అని దివ్య ఏడుస్తుంది. దివ్య ఫింగర్ చూపిస్తూ పాయింట్స్ చెప్తుంది. ఫింగర్ చూపించకు నీకు మాట్లాడే విధానం తెలియదని భరణి అంటాడు.
మీకు అంత ఇబ్బందిగా ఉంటే ముందే చెప్పాలి కదా.. ఎవరైనా మీ నోటిని కట్టేసారా అని దివ్య అంటుంది. ఇదే నీలో నచ్చనిది.. ఏదైనా ఉంటే స్ట్రేట్ గా చెప్పమని దివ్యపై గట్టిగట్టిగా అరుస్తాడు భరణి. దాంతో ఇక మీరు నాతో మాట్లాడకండి భరణి గారు అని దివ్య చెప్తుంది. దివ్య ప్రైవేట్ నామినేషన్ లో భరణిని నామినేషన్ చేస్తుంది. ప్రతీదాంట్లో సపోర్ట్ చేస్తారనుకుంటా కానీ ఎప్పుడు డిస్సపాయింట్ చేస్తారు. మీ వల్ల నా గేమ్ పోయిందని దివ్య రీజన్ చెప్తుంది.