English | Telugu

Bigg Boss 9 voting : ఫేక్ ఓటింగ్‌తో తనూజ టాప్.. డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక పన్నెండవ వారం హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ లు మొదలెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలో ఉన్న కెప్టెన్ లని హౌస్ లోకి రప్పిస్తున్నాడు బిగ్ బాస్. ఎక్స్ కంటెస్టెంట్స్ వర్సెస్ సీజన్-9 కంటెస్టెంట్స్ అన్నట్టుగా ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది.

ఈ వారం రీతూ కెప్టెన్ గా ఉండటంతో తను తప్ప హౌస్ లోని వాళ్ళంతా నామినేషన్ లో ఉన్నారు. మరి వారిలో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది.. జెన్యున్ ఓటింగ్.. ఫేక్ ఓటింగ్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. ఏ అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్ చూసిన తనూజ టాప్ లో ఉంది. తనకి ముప్పై శాతం పైనే ఓటింగ్ పడుతోంది. అంటే వంద మంది ఓటింగ్ చేస్తే అందులో ముప్పై మంది తనకి ఓటింగ్ చేయగా మిగిలిన డెబ్బై మంది ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేస్తున్నారన్న మాట. తనూజకి పడే ఓటింగ్ అంతా బిగ్ బాస్ మామ దగ్గరుండి చేసుకుంటున్నాడని, ఫేక్ ఓటింగ్ క్రియేట్ చేస్తున్నారనే రూమర్ అయితే నడుస్తోంది. ఇక రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ పడాల ఉన్నాడు. అతనికి ఇరవై అయిదు శాతం ఓటింగ్ పడుతోంది. అయితే ఇందులో కూడా కొంత ఫేక్ ఓటింగ్ అనేది ఉంది.. ఎందుకంటే బిగ్ బాస్ మామ ఈ సీజన్-9 లో కళ్యాణ్ ని విన్నర్ చేయాలని, తనూజని రన్నరప్ చేయాలని చూస్తున్నాడని సోషల్ మీడియా అంతటా ప్రచారం సాగుతుంది. ఇక మూడో స్థానంలో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. అతనికి పదమూడు శాతం ఓటింగ్ పడుతోంది.

సంజన గల్రానీకి ఏడు శాతం ఓటింగ్ పడుతోంది. భరణికి, డీమాన్ పవన్ కి ఆరు శాతం ఓటింగ్ పడుతోంది. సుమన్ శెట్టి, దివ్య నిఖితకి అయిదు శాతం ఓటింగ్ పడుతోంది. అంటే ఈ వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు చాలా వరకు ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టికి బిగ్ బాస్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే తను గేమ్ ఆడినా ఆడకపోయినా అతను ఇప్పటివరకు హౌస్ లోనే ఉన్నాడు. ఈ లెక్కన ఈ వారం దివ్య నిఖిత ఎలిమినేషన్ ఫిక్స్ అన్నమాట. హౌస్ లో జెన్యున్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య నిఖిత.. మిగతా వారంతా ఎంతో కొంత కన్నింగ్ అండ్ స్ట్రాటజీలు ప్లే చేస్తూ నెట్టుకొచ్చేవాళ్ళే. నేటి ఓటింగ్ ని బట్టి చూస్తే సుమన్ శెట్టి, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు.